Eatala Rajender : కాంగ్రెస్ గెలిచినా.. సీఎం అయ్యేది కేసీఆరే- ఈటల సంచలన వ్యాఖ్యలు

Eatala Rajender: కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనియ్యడం లేదు. రేపు కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే.

Eatala Rajender : కాంగ్రెస్ గెలిచినా.. సీఎం అయ్యేది కేసీఆరే- ఈటల సంచలన వ్యాఖ్యలు

Eatala Rajender(Photo : Twitter)

Eatala Rajender : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం కేసీఆరే అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఈటల చెప్పారు. అది ప్రజలతో చీత్కారం పొందిన పార్టీగా అభివర్ణించారు. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీసులను నమ్ముకున్నారు అని అన్నారు. ప్రతిపక్ష నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. లొంగకపోతే కేసులు పెడుతున్నారు, ఇది పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు ఈటల.

Also Read..Achchennaidu : వైసీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు : అచ్చెన్నాయుడు

” కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే.. కాంగ్రెస్ నేతలకు నోటీసులు వస్తే వారికంటే ముందు బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనియ్యడం లేదు. రేపు కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ సభను విజయవంతం చేసి ఢిల్లీ నాయకత్వానికి మరింత విశ్వాసం కల్పిద్దాం. తెలంగాణ గడ్డ బీజేపీ అడ్డా అని నిరూపిద్దాం” అని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

మరోవైపు మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక నేపథ్యంలో ఈ నెల 23న చేవెళ్లలో జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు బండి సంజయ్.

Also Read..Telangana Politics: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

చేవెళ్ల బహిరంగ సభ సన్నాహాక సమావేశానికి బండి సంజయ్ తో పాటు హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లుతో పాటు చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ నేతలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తారు.