వెంటనే పట్టుకోండి : ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది జిల్లా

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 02:44 PM IST
వెంటనే పట్టుకోండి : ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది జిల్లా

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో-3, తూర్పుగోదావరిలో-14, కృష్ణాలో-3, ప్రకాశంలో-4, చిత్తూరులో-3, కర్నూలులో-8, విశాఖపట్నంలో-8, గుంటూరు, అనంతపురంలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. నిందితులపై ఐపీసీ 120బి, 419, 420, 471, ఐటీ యాక్ట్ 66, 66డి.. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31ల ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. ఓటర్లకు తెలియకుండా  ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపునకు ఫాం-7 దరఖాస్తు చేసిన వారిని గుర్తించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఓట్ల తొలగింపు కోసం ఆన్‌లైన్‌లో ఫాం.7 కింద వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, ఐపీ అడ్రస్‌లు సేకరిస్తున్నామని ద్వివేది చెప్పారు. విచారణ జరపాలని పోలీస్‌ శాఖను కోరామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు మీ-సేవా సిబ్బంది హస్తం ఉందని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్ల తొలగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ముఖ్యంగా ఇటు తిరుపతి, అటు చంద్రగిరి నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ నాయకులు పోటాపోటీగా ఆరోపణలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తమ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని రెండు పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం విశేషం.

* ఓటర్లకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7 దరఖాస్తు
* తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు మీ-సేవా సిబ్బందిపై కేసులు నమోదు
* సీ డాక్ సహకారంతో ఐపీ అడ్రస్‌ ఆధారంగా బాధ్యుల్ని గుర్తించే ప్రయత్నం
* నిందితులపై ఐపీసీ 120బి, 419, 420, 471, ఐటీ యాక్ట్ 66, 66డి..
ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31ల ప్రకారం కేసులు నమోదు
* ఓటర్ల తొలగింపు సమాచారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సీఈసీ ద్వివేది ఆదేశం