Wayanad: రాహుల్ గాంధీ కోల్పోయిన వయనాడ్ నియోజకవర్గంలో తొందరలో ఎన్నిక?
2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?" అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరువునష్టం దాఖలు చేశారు. ఈ కేసులోనే రాహుల్ దోషిగా తేలారు. అయితే స్థానిక కోర్టు ఈచ్చిన ఈ తీర్పును సెషన్స్ కోర్టులో సవాలు చేయాలని యోచిస్తున్నట్లు రాహుల్ బృందం తెలిపింది.

Election To Rahul Gandhi's Wayanad Seat Soon?
Wayanad: కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం శుక్రవారం ఖాళీ కావడంతో సెప్టెంబర్‌లోగా ఉప ఎన్నిక జరగవచ్చని అంటున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు గురువారం పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో రాహుల్ మీద అనర్హత వేటు పడింది. తీర్పుపై అప్పీల్ చేసేందుకు కాంగ్రెస్ నేతకు 30 రోజుల పాటు బెయిల్ మంజూరైంది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ప్రజాప్రాతినిధ్య చట్టం, 2015లోని సెక్షన్ 151(ఏ) ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉపఎన్నికలు ఆ స్థానం ఖాళీ అయినప్పటి నుండి ఆరు నెలలలోపు నిర్వహించాలి. ఈ చట్టమే రాహుల్‌ని ఎంపీగా తొలగించడానికి మార్గం సుగమం చేసింది. చట్టంలోని సెక్షన్ 8(3) ప్రకారం, ఒక ఎంపీ దోషిగా నిర్ధారించబడితే కనీసం రెండేళ్లపాటు శిక్ష విధించబడిన వెంటనే అనర్హత వేటు పడుతుంది.
Rahul Press meet: ఏం చేసుకుంటారో చేసుకోండి, తగ్గేదే లేదు.. అనర్హతపై మోదీకి రాహుల్ ఛాలెంజ్
లోక్‌సభ సెక్రటేరియట్ నిన్న గాంధీపై అనర్హత వేటును స్పష్టం చేసింది. ఇప్పుడు ఉప ఎన్నికల తేదీలను ప్రకటించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. లోక్‌సభలో ఇప్పుడు రెండు స్థానాలు ఖాళీలు ఉన్నాయి. ఒకటి జలంధర్ నియోజకవర్గం కాగా, మరొకటి వాయనాడ్ నియోజకవర్గం. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వయనాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ సీటు నుంచి పోటీ చేశారు. అయితే ఆ స్థానం నుంచి ఓడిపోయారు. వయనాడ్ నుంచి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు.
Rahul Press meet: నేను సావర్కర్ కాదు, గాంధీని.. ‘సారీ’పై రాహుల్ సెటైర్లు
2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరువునష్టం దాఖలు చేశారు. ఈ కేసులోనే రాహుల్ దోషిగా తేలారు. అయితే స్థానిక కోర్టు ఈచ్చిన ఈ తీర్పును సెషన్స్ కోర్టులో సవాలు చేయాలని యోచిస్తున్నట్లు రాహుల్ బృందం తెలిపింది.