Perni Nani : చంద్రబాబు అవసరాలకు పెట్టిన టెంట్ హౌస్ జనసేన- పేర్నినాని

Perni Nani : ఒకప్పుడు సంవత్సరానికి 100 కోట్లు వదులుకొని రాజకీయాలు చేస్తున్నా అన్నాడు. మరిప్పుడు చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు వస్తాడు.

Perni Nani : చంద్రబాబు అవసరాలకు పెట్టిన టెంట్ హౌస్ జనసేన- పేర్నినాని

Perni Nani (Photo : Google)

Perni Nani -Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తన అజెండా అని, అందుకోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పొత్తుల గురించి పవన్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. పవన్ వ్యాఖ్యలు వైసీపీ (YCP) శ్రేణుల్లో కలవరం నింపగా, టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. పవన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు స్వాగతిస్తే.. వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

పవన్ వ్యాఖ్యలపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన పేర్నినాని పవన్ తీరుపై విరుచుకుపడ్డారు. ”పవన్ కల్యాణ్ కి ఇప్పుడు గుర్తొచ్చిందా? 2014లో పార్టీ పెట్టే సమయంలోనే తెలుసు బలం లేదని. అప్పుడు బలం లేదు, పోటీ చేయలేదు అని చెప్పాడు. 2019లో చంద్రబాబుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ ఓటు జగన్ కి వెళ్లకుండా చీల్చడానికి పోటీ చేశాడు. చంద్రబాబు అవసరాలకు పెట్టిన టెంట్ హౌస్ పార్టీ జనసేన” అని పేర్నినాని విమర్శించారు.(Perni Nani)

Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

”నా బాధంతా ఒక్కటే. పవన్ కల్యాణ్ ని నమ్ముకుని సాఫ్ట్ వేర్ జాబులు సైతం వదులుకుని, పవన్ ని సీఎంని చేయాలని కంకణం కట్టుకుని ఊర్లు తిరుగుతున్నారు జన సైనికులు. వారు త్యాగాలను మానుకుని కన్న తల్లిదండ్రుల ఆశలు తీర్చాలని కోరుతున్నా. ఓట్ల కోసమే రాజకీయాలు చేయడం పవన కళ్యాణ్ కి చెల్లింది. ఒకప్పుడు సంవత్సరానికి 100 కోట్లు వదులుకొని రాజకీయాలు చేస్తున్నా అన్నాడు. మరిప్పుడు చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు వస్తాడు. ఏదో వాహనం అంటూ హడావుడి చేసి ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే బయటకు తీస్తా అంటున్నాడు ” అని పవన్ పై ధ్వజమెత్తారు పేర్నినాని.(Perni Nani)

Also Read..Andhra Pradesh : ఏపీ ఆర్థిక పరిస్థితి‎పై కావాలనే తప్పుడు ప్రచారం : సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ

పొత్తులు, సీఎం పదవిపై అసలు పవన్ ఏమన్నారంటే..
”నాకు పదవులు ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మొదటి నుంచి దానికే కట్టుబడి ఉన్నా. ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్ చేయను. సీఎం పదవి కోసం తాపత్రయ పడకూడదు. సీఎం పదవి అనేది వరించి రావాలి తప్ప, కోరుకుంటే వచ్చేది కాదు. మన కష్టం మీదే ముఖ్యమంత్రి పదవి మనల్ని వరించాలి తప్ప మనం ఆ పదవి కోసం పాకులాడకూడదు. పొత్తుల్లో సీఎం అభ్యర్థి కండీషన్ ఉండదు. రాష్ట్ర భవిష్యత్తు కండీషన్ మాత్రమే ఉంటుంది.(Perni Nani)

కండీషన్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి పొందలేము. నా పార్టీ బలం ఏంటో నాకు తెలుసు. అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాటకే కట్టుబడి ఉన్నా. పొత్తులతో ముందుకెళతాం” అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.