వీడెవడండి బాబూ : పవన్ కు షాక్ ఇచ్చిన అభిమాని

పవన్‌ కల్యాణ్‌కు బీభత్సమైన ఫ్యాన్స్‌ ఉంటారు. అప్పుడప్పుడూ పవన్‌ను కూడా ఆశ్చర్యపరుస్తారు. విజయవాడ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు.

  • Published By: veegamteam ,Published On : March 23, 2019 / 04:16 PM IST
వీడెవడండి బాబూ : పవన్ కు షాక్ ఇచ్చిన అభిమాని

పవన్‌ కల్యాణ్‌కు బీభత్సమైన ఫ్యాన్స్‌ ఉంటారు. అప్పుడప్పుడూ పవన్‌ను కూడా ఆశ్చర్యపరుస్తారు. విజయవాడ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు బీభత్సమైన ఫ్యాన్స్‌ ఉన్నారనే సంగతి తెలిసిందే. వారి అభిమానం ఓ రేంజ్ లో ఉంటుంది. హద్దులు మీరిన అభిమానంతో అప్పుడప్పుడూ పవన్‌ను కూడా ఆశ్చర్యపరుస్తారు. విజయవాడ సభలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. పవన్‌ ప్రసంగిస్తుండగా సెక్యూరిటీని దాటుకొని వచ్చిన అతడు.. ఠక్కున్న పవన్ కాళ్లు పట్టుకున్నాడు. సెక్యూరిటీ ఆ అభిమానిని విడిపించే ప్రయత్నం చేసినా.. అతడు పవన్‌ కాళ్లను వదిలిపెట్టలేదు. అభిమాని చేష్టలతో ముందు పవన్‌ షాక్‌ తిన్నా.. తర్వాత తేరుకుని నవ్వుకున్నారు. అసలేం జరుగుతుందో తెలియక స్టేజ్ మీద ఉన్నవారంత కాసేపు ఆందోళనకు గురయ్యారు.