Latest Political News from India | 10TV Telugu

Pawan Kalyan: సై అంటే సై.. కాంగ్రెస్ లీడర్లు పవన్ కల్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేశారు? కారణం అదేనా..
పవన్ చుట్టూ రంకెళ్లు వేస్తున్న తెలంగాణ రాజకీయం

భారీ బహిరంగ సభతో రీఎంట్రీకి ప్లాన్ చేసిన పవన్

పవన్ సభకు బ్రేకులు..కాంగ్రెస్‌ నేతల ఎదురుదాడి

తెలంగాణకు రానిచ్చే ముచ్చటే లేదన్న హస్తం లీడర్లు

తెలంగాణలో తిరుగుతా..పోటీ చేసి తీరుతానంటున్న పవన్

Pawan Kalyan: సమ్మర్ హీట్‌ వేవ్‌ కంటే..తెలంగాణ సెంటిమెంట్ పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి. పవన్‌ ద్వారా తెలంగాణలో కూటమి ఎంట్రీకి బీజేపీ వేసిన స్కెచ్‌కు ఆదిలోనే బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. హైదరాబాద్‌లో..పైగా తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్ సభ పెడతానని ప్రకటించడంతో..రచ్చ స్టార్ట్‌‌ అయింది. పీసీసీ చీఫ్ నుంచి మంత్రులకు వరకు అందరూ పవన్ సభను వ్యతిరేకించారు. పోలీసులు, కోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో..చివరకు ప్రెస్‌మీట్‌ పెట్టి..స్ట్రాంగ్‌ వాయిస్ వినిపించారు పవన్. తెలంగాణలో తిరిగి తీరతానని సవాల్‌ చేశారు జనసేనాని. పవన్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ రాజకీయ రచ్చ ఎటువైపు? పవన్‌ పేరు ఎత్తితే కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఒంటి కాలిపై లేస్తున్నారు?

తెలంగాణ పాలిటిక్స్‌లో..జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెంట్రిక్‌గా పెద్ద రచ్చే నడుస్తోంది. ప్రొ.నాగేశ్వర్‌ వ్యాఖ్యలతో మొదలైన ఇష్యూ, తెలంగాణ కాంగ్రెస్ నేతల అటాక్‌తో రాజకీయ దమారం పీక్‌ లెవల్‌కు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు..హైదరాబాద్‌లో నవ నిర్మాణ సభ పెట్టాలని పవన్ భావించడం గొడవకు ప్రధాన కారణమైంది. దీంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజుకుంది. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..తెలంగాణ తిరగనివ్వబోమంటూ కాంగ్రెస్ నేతలు స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. పవన్ నటనను, డ్రెస్సింగ్ సెన్స్‌ను, బీజేపీతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని విమర్శిస్తూ మంత్రి పొన్నం చేసిన కామెంట్స్‌ ఫుల్ వైరల్ అయ్యాయి. పవన్ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌ గౌడ్..జనసేనాని ప్రెస్‌మీట్‌కు కూడా అనుమతించేది లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఆత్మగౌరవానికి భంగం అంటూ సెంటిమెంట్‌ను రాజేసే ప్రయత్నం..

అయితే ఈ డెవలప్‌మెంట్స్ అన్నీ ఒక్కరోజులో జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా..ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం, తెలంగాణ పాలిటిక్స్‌లో తెలియని అలజడి మొదలైంది. కాంగ్రెస్‌ నేతలు ముందుగానే అలర్ట్ అయ్యారు. పవన్ సభ ద్వారా తెలంగాణలో కూటమి ఎంట్రీకి ప్లాన్ చేస్తే..మొదటల్లోనే ఆ ప్రయత్నానికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది. బీజేపీ సొంతంగా బలపడే కంటే పవన్ వంటి స్టార్ పవర్ సాయంతో పుంజుకుంటుందేమోనని అలర్ట్ అయిన కాంగ్రెస్‌..ఔట్‌ రైట్ స్టాండ్ తీసుకుని పవన్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత కూడా పవన్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు భోజనం చేయలేదని పవన్ గతంలో చేసిన కామెంట్స్..కోనసీమ కొబ్బరి చెట్ల వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ప్రధాన ఆయుధాలుగా మారాయి. పవన్ ఇక్కడ అడుగుపెడితే తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని, సెంటిమెంట్‌ను రాజేసే ప్రయత్నం చేశారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు.

ఇంకెంత కాలం ఈ ప్రాంతీయ విద్వేషాలు?

ఫైనల్‌గా సభకు అనుమతివ్వాలంటూ జనసేన వేసిన పిటిషన్‌ను కోర్టు కూడా స్వీకరించకపోవడంతో ప్రెస్‌మీట్‌ అంటూ మీడియా ముందుకు వచ్చిన జనసేనాని ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు వ్యతిరేకం కాదు..రాష్ట్రాన్ని విభజించిన తీరుకు వ్యతిరేకమంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేన ఉంటుంది. పోటీ చేస్తుంది. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాడులు, బెదిరింపులకు భయపడే ముచ్చటే లేదన్నారు. ఇందిరా గాంధీ, ప్రియాంక, రాహుల్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు కానీ..తాను తెలంగాణకు రావొద్దా అంటూ ప్రశ్నించారు. పదే పదే ఆంధ్రా అంటూ ప్రస్తావించడం తనకు నచ్చడం లేదన్నారు పవన్.

జనసేనాని కామెంట్స్‌కు కాంగ్రెస్ నేతల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ జరుగుతోంది. అటు పవన్, ఇటు కాంగ్రెస్ నేతలు తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో..తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పవన్ సెంట్రిక్‌గా తెలంగాణలో పొలిటికల్ హీట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాంతీయ వాదానికి, పవన్ చెప్తున్న జాతీయవాద ఆలోచనలకు మధ్య జరుగుతున్న ఈ పోరు, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.

Also Read: ఖజానా ఖాళీ? పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో తెలంగాణ సర్కార్? సవాళ్లు దాటేదెలా..

Telangana Government: ఖజానా ఖాళీ? పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో తెలంగాణ సర్కార్? సవాళ్లు దాటేదెలా..
ఎమ్మెల్యేలతో మీటింగ్‌లో భట్టి కామెంట్స్‌కు అర్థమేంటి?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడేదెప్పుడు?

కాగ్ రిపోర్ట్‌తో తేటతెల్లమైన సర్కార్ ఆర్థిక పరిస్థితి!

Telangana Government: కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ బండిని నడపలేక దిక్కులు చూస్తోందా? ఏం చేయాలో తోచక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారా? తెలంగాణ సర్కార్‌కు ఆర్థిక కష్టాలు కొత్త తలనొప్పులు తెస్తున్నాయా? నిధుల లేమితో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఏకంగా ఆర్థిక శాఖ మంత్రే ఎమ్మెల్యేలతో ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆర్థిక పరిపుష్టికి ఇంకా సమయం పడుతుందని..అప్పటిదాకా కొత్తగా నిధులు ఇవ్వలేమంటూ ఏకంగా ఆర్థిక మంత్రే చేతులెత్తేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్ అయింది. ఇలా అయితే ఇక ప్రజల్లోకి వెళ్లేది ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు.

తెలంగాణ సర్కార్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. అవును. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ఇదే స్పష్టం చేస్తోంది. లోటు బడ్జెట్‌తో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు కాగ్ స్పష్టం చేసింది. హామీల అమలుకు ఆర్థిక స్థితి అడ్డంకిగా మారుతోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇస్తే..వాటిని అమలు చేయడం ఇప్పుడు సర్కార్‌కు సవాల్‌గా మారింది. బడ్జెట్ అంచనాలకు..వాస్తవాలకు పొంతన లేని పరిస్థితి. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ఆదాయం వస్తే దాదాపు 108 రూపాయలు ఖర్చు అవుతుంది. దీని కోసం ప్రతినెల అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో కేవలం రెండున్నర ఏళ్లలోనే 4.14 లక్షల కోట్ల అప్పులను తెచ్చింది సర్కార్. గతంలో ఉన్న అప్పులకు..అసలు, వడ్డీలు కట్టలేక నడ్డి విరుగుతుంటే..మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లుగా కొత్తగా అవుతున్న లక్షల కోట్ల అప్పులు రేవంత్ ప్రభుత్వానికి గుదిబండగా మారాయి.

ప్రతి నెలా దాదాపు రూ.18 వేల నుంచి 20 వేల కోట్ల ఖర్చు..

అటు సంక్షేమాన్ని.. ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాటపడుతుంటే..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారుతోంది. దీంతో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు…కొత్త కొత్త పనులు, ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ సర్కార్ ముందుకెళ్తోంది. వాస్తవంగా ప్రతి నెల జీతాలు, పెన్షన్లు, అసలు, వడ్డీల చెల్లింపు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, ఇతర చెల్లింపులు అన్ని దాదాపు 18 వేల నుంచి 20 వేల కోట్ల వరకు ఖర్చవుతుంది. కానీ వాస్తవ రాబడి మాత్రం కేవలం 16 నుంచి 18 వేల కోట్లలోపే ఉంటుంది. అంటే దాదాపు ప్రతి నెల సగటున రూ.2,250 కోట్ల లోటు సర్కార్ కు సవాల్ గా మారుతోంది. ప్రభుత్వం శక్తికి మించి కార్యక్రమాల అమలుకు, కొత్త అభివృద్ధి పనులను చేపట్టడం.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందన్నట్లుగా తయారైంది పరిస్థితి.

ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భట్టి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలకో, సంవత్సరానికో పరిస్థితి కుదుట పడుతుందని భట్టి తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ప్రభుత్వం ఎప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుందో? ఖజానా ఎప్పుడు కళకళలాడుతుందో? అప్పులు తీసుకునే అవసరం తగ్గుతుందో లేదో అనేది చూడాలి.

Also Read: కేసీఆర్, రేవంత్ వేరే రాష్ట్రాలకు పోవచ్చు.. పవన్ కల్యాణ్ సభ పెట్టుకోకూడదా? కాంగ్రెస్ పై రఘునందన్ రావు ఫైర్

Raghunandan Rao: కేసీఆర్, రేవంత్ వేరే రాష్ట్రాలకు పోవచ్చు.. పవన్ కల్యాణ్ సభ పెట్టుకోకూడదా? కాంగ్రెస్ పై రఘునందన్ రావు ఫైర్
Raghunandan Rao: తెలంగాణలో జనసేన సభకు అనుమతించకపోవడంపై తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్ సెట్ తో ఉందని టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమేంటి అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు.

”పవన్ కల్యాణ్ ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేశంలో అనేకమంది అనేక ప్రాంతాలకు వెళ్లి మాట్లాడుతుంటాం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మీడియాతో చిట్ చాట్ చేస్తానే ఉంటారు. మరో రాష్ట్ర డిప్యూటీ సీఎం పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ లేదా సభ పెడితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం నాకైతే కనిపించడం లేదు. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబితే బాగుంటుంది.

రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తారు. కేసీఆర్ వేరే రాష్ట్రానికి పోయి రైతులకు పైసలు ఇచ్చి వస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. పవన్ కల్యాణ్ ఎన్డీయేలో భాగం. ఆయనను మేము ఎలా వేరు చేస్తాం. ఆయన ఏ రాష్ట్రంలో ఉంటే ఏంటి? ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు కూడా. ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వారు వేరే రాష్ట్రాలకు పోవద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేది ఏముంది? అని ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.

Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Mla Anirudh Reddy: ఎక్కువ ప్యాకేజీ ఇస్తే జగన్ కి కూడా మద్దతిస్తారు..!- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
Mla Anirudh Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమలో ప్యాకేజ్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ల సినిమాలో నటిస్తారు.. రాజకీయాల్లో సైతం ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే పవన్ మద్దతిస్తున్నారు అని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ ఆయనకి కూడా మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును జైల్లో కలవడమే పవన్ ప్లస్ పాయింట్ అని అన్నారు.

”పవన్ కల్యాణ్ తెలంగాణకి క్షమాపణ చెప్తారని అనుకున్నా. నరదృష్టి ఉన్న దగ్గరికి పవన్ ఎందుకు రావాలి? పవన్ వెళ్ళి గుజరాత్ లో పోటీ చేయాలి. నల్లగా అయిపోతాననే పవన్ విజయవాడ వెళ్ళడం లేదు. గ్లామర్ కాపాడుకోవడం కోసమే పవన్ హైదరాబాద్ లో ఉంటున్నారు. టీటీడీ డబ్బులపై కూడా పవన్ రాజకీయం చేస్తున్నారు? పవన్ ఇంగ్లీషులో మాట్లాడింది అమిత్ షా కి అర్థం కావడానికే. కేసీఆర్, అమిత్ షాను ఇంప్రెస్ చేయడానికే పవన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి భూముల వ్యవహారమే తెలీదు. పవన్ కబ్జా చేసిన భూమి దగ్గరికి వెళ్తే కేసులు పెడతారా? రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి పవన్ డిప్రెషన్ లో ఉన్నారు” అని అనిరుధ్ రెడ్డి అన్నారు.

”బీజేపీ నుంచో బీఆర్ఎస్ నుంచో పవన్ కల్యాణ్ కు డబ్బులు వస్తున్నాయి. ఏపీలో ఏమీ చేయలేని వ్యక్తి తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు? పవన్ అహంకారంతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ను కాపాడుకుంటూ పవన్ మాట్లాడారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయొద్దని, రాజ్యసభ టికెట్ తీసుకోవద్దని ఆరోజు పవన్ ఎందుకు చెప్పలేదు? ఆరోజు అలా మాట్లాడారు.

ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారా? ఏపీ, తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉంటాయంటే.. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారుతుంటాయి. తెలంగాణలో పదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి. ఏపీలోనే న్యాయం చేయలేకపోయారు. డిప్యూటీ సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉన్నారు? విజయవాడలో ఎన్నిరోజులు ఉన్నారో పవన్ కల్యాణ్ చెప్పాలి” అని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ మా అయ్య జాగీరే- పవన్ కల్యాణ్ కు మంత్రి పొన్నం కౌంటర్
Ponnam Prabhakar – Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. మిస్టర్ పవన్ కల్యాణ్… ఇది మా అయ్య జాగీరే అని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ.. 4 కోట్ల మంది ప్రజల జాగీరు. మీ అయ్య జాగీరు కాదు అని ఎదురుదాడికి దిగారు.

”పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి చేసేదేంటి? పవన్ పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా పవన్ తో ఒక క్యారెక్టర్ చేయిస్తా. తెలంగాణపై పవన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పవన్. గద్దర్ కు కార్ కొనిచ్చినా అని చెప్పినందుకు ముందు క్షమాపణ చెప్పు. చనిపోయిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తనకి ఆంధ్రాలోనే దిక్కు లేదని పవన్ చెప్పుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా వాళ్ళని మేము ఏమీ అనలేదు. మేం ఆంధ్రా వాళ్ళని ఏదో అన్నట్టు పవన్ అబద్ధాలు చెబుతున్నారు.

పార్లమెంటులో ఏ బిల్లు చేసినా తలుపులు మూసే పాస్ చేస్తారు. కొండగట్టుకు ఇచ్చిన పైసలు మీ అయ్యా జాగీరా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ పెట్టడం గెలకడం కాదా? పవన్ తిరిగితే జనాలు వస్తారు. కానీ, ఓట్లు వేయరు. పవన్ వచ్చినా, పోయినా మాకేం సంబంధం లేదు. తెలంగాణ ఎప్పుడైనా ఏపీ ప్రజలను స్వాగతిస్తూనే ఉంటుంది. సినిమా నటుడిగా పవన్ ఎక్కడ తిరిగినా మాకేం ఇబ్బంది లేదు” అని కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Pawan Kalyan – Alliances : తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
Pawan Kalyan – Alliances : హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీ, పొత్తులపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 2028 ఎన్నికల్లో తెలంగాణ జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పొత్తు.. టీడీపీతోనా, బీజేపీతోనా అనేది వాళ్లే చెప్పాలన్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారని.. నేను కూడా మా పార్టీ నేతలకు ఒంటరిగానే పోటీ చేయమని సలహా ఇస్తానని చెప్పారు.

”ఇంకా ఎంత కాలం ఈ బెదిరింపులు? మీరు భయపెట్టే కొద్దీ ఈ గుండె గట్టిపడుతుంది తప్ప భయపడదు. ఇంకెంత కాలం ఈ ప్రాంతీయ విబేధాలు. తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ రాష్ట్రాన్ని ఏరోజూ కూడా జనసేన అగౌరవపరచలేదు. గుండెల్లో పెట్టుకుంది. ప్రాంతీయతను గౌరవిస్తాం. కానీ, అదే ప్రాంతీయత పేరుతో జాతీయ వాదాలను బలహీన పరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు.

2008, 2009లో తెలంగాణ అంతా తిరిగాను. మీరు రమ్మంటే నేను ఎందుకు రాను. నాకు భయాలు లేవు. గొడవలు పెట్టేందుకు రాను. సమస్యలపై పోరాడేందుకు అయితే వస్తాను. మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఆంధ్రోళ్లు, తెలంగాణ వాళ్లు అని వేరు చేసి మాట్లాడితే అది చాలా ప్రమాదకరం. తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం వ్యతిరేకించాయి. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామనా..?

పార్టీ పెట్టాము అంటే చనిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. తిరిగి గడీల పాలన తెస్తారా? దొరల పాలన తెస్తారా? నాలాంటి వాడినే భయపెడితే, నాలాంటి వాడి తోటలోకే వస్తే.. ప్రతి ఒక్కరి ఇంట్లోకి దూరతారు.. అందుకే ఆపుతున్నా.. నా మీద దాడి చేస్తే భయాలు లేవు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించిన తీరునే నేను తప్పుపట్టాను. తెలంగాణ వచ్చినందుకు నేను ఎప్పుడూ బాధ పడలేదు. ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానా? ప్రజలను చైతన్యవంతులం చేస్తామని అంతా భయపడుతున్నారు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Pawan Kalyan Janasena: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్
Pawan Kalyan Janasena : హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగం అని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే నేడు ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోకి ఎలా వస్తావో చూస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వైఎస్ హయాంలో యూత్ కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తే తన్ని తరిమేశాం అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

”నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు కాబట్టి చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. ఎప్పుడూ పోటీ చేస్తుంటాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగతా. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ఎదుర్కొంటాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ నా భారత దేశంలో అంతర్భాగం. మీరు కూర్చోబెట్టి రాకూడదు అంటే భరించాం. పదేళ్లకు పైగా భరించాము. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం మేము.

తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. 12 ఏళ్లు తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. తెలంగాణలోకి ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటున్నారు. ఇలాంటి ప్రగల్బాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే… ఆరోజు వారిని తన్ని తగలేశాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు.

Pawan Kalyan: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్
Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడారు. హైదరాబాద్ లో పవన్ కు ఏం పని? అని కొందరు వ్యక్తులు పదే పదే బెదిరిస్తున్నారు.. మీరెవరు నన్ను బెదిరించటానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ కల్యాణ్ ఎదురు దాడికి దిగారు. తెలంగాణలో బెదిరింపుల కంటే ఏపీలో బెదిరింపులు ఎక్కువ అని చెప్పారు. ఏపీలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వం అంటే తెలంగాణ జనసైనికులు నాకు అండగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనే అధికారం కోరుకోని వాడిని, తెలంగాణలో కోరుకుంటానా? ఒక మార్పు తప్ప. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. మీరు సమస్యల మీద పోరాడండి అని మా పార్టీ నాయకులను కోరా. మాట్లాడితే ఆంధ్రా అంటున్నారు. హైదరాబాద్ లో ఏం పని? అంటున్నారు. హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వం అని బెదిరిస్తున్నారు. మీరెవరు నన్ను బెదిరించటానికి? మీ అయ్య జాగీరా తెలంగాణ? నాకు తెలంగాణలో కంటే ఆంధ్రలో బెదిరింపులు ఎక్కువ. ఆంధ్రలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు.

తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకిక్కడ కొత్తగా బాగుకునేది ఏమీ లేదు. బెదిరించే వాళ్లకు అందరికీ చెబుతున్నా.. నా ఇంటి ముందు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా రండి.. ఇదే నా ఇంటి అడ్రస్. మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఎలాంటి భయాలు లేవు. బాంచన్ కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతా? భయపడే వాళ్లమే అయితే పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో నేను తెలంగాణ నాయకులను ఒక్క మాట కూడా అనలేదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Addanki Dayakar – Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ని బలి చేయకండి, పవన్‌కు రాజకీయాలు తెలీదు- అద్దంకి దయాకర్
Addanki Dayakar – Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. పవన్ ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇవ్వడం కుదరదని అద్దంకి దయాకర్ తేల్చి చెప్పారు. మంచి ఉద్దేశ్యంతో మీటింగ్ పెడతామంటే పర్మిషన్ ఇస్తామన్న అద్దంకి దయాకర్.. కుట్రతో పర్మిషన్ అడిగితే అనుమతి ఇవ్వము అని తేల్చి చెప్పారు. లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య చిచ్చు, కుట్ర పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కాగా, గతంలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర చేస్తామంటే పర్మిషన్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ తన స్వార్థం కోసం పవన్ కల్యాణ్ ని బలి చేయొద్దని అద్దంకి దయాకర్ కోరారు. పవన్ కల్యాణ్ కి రాజకీయాలు ఏమీ తెలియవన్నారు.

”చేగువేరా వారసుడిగా చెప్పుకుంటూ సనాతనం కోసం పాటుపడే వ్యక్తి పవన్. పవన్ రాజకీయాలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు. టార్గెట్ తెలంగాణ అని మోదీ అంటే మేం అర్థం చేసుకోలేకపోయాం. మోదీ ఓట్ల మ్యాజిక్ తో గెలవగలరు. ప్రజలను గెలవలేరు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినని వ్యక్తి పవన్. జూన్ 2న పవన్ మీటింగ్ ఎందుకోసం పెట్టారో తెలియదా? బీజేపీ అనుకూల రాజకీయాలు చేసేందుకు బీఆర్ఎస్ స్పాన్సర్ చేస్తున్న కార్యక్రమమే పవన్ మీటింగ్. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసే పవన్ ను తెరపైకి తెచ్చాయి. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా?

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టే వాళ్ళు మా వ్యతిరేకులే. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడితే ఊరుకోము. బీజేపీ నేతలు నల్లి కుంట్లోళ్ళు . తెలంగాణపై ఇంత దాడి జరిగితే కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? తెలంగాణపై బీజేపీ నిలువెల్లా విషం కక్కుతోంది. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానంటేనే మోదీతో రేవంత్ కలుస్తారు. సుష్మా స్వరాజ్ అంటే మోదీకి ఇష్టం ఉండదు” అని అద్దంకి దయాకర్ అన్నారు.

Also Read: తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ తను చెప్పుకోవాలి

Mla Thomas: కాంట్రవర్సీకి కేరాఫ్‌గా టీడీపీ ఎమ్మెల్యే థామస్.. సొంత పార్టీ నేతలు, అధిష్టానం సీరియస్.. ఎందుకు?
కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఎమ్మెల్యే థామస్

ఎస్సీ ఎమ్మెల్యేలకు గౌరవం లభించట్లేదని కామెంట్స్

లేటెస్ట్‌గా అగ్రవర్ణ ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యలు

ఎమ్మెల్యే థామస్‌ తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్

థామస్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేల గుస్సా

Mla Thomas: నోరు జారి, మళ్లీ నాలుక కరుచుకున్నారు ఆ టీడీపీ ఎమ్మెల్యే. సొంత పార్టీకి చెందిన సహచర ఎమ్మెల్యేలపైనే ఇండైరెక్ట్‌ కామెంట్స్‌ చేశారు. ఆయనతో పాటు వేదిక పంచుకున్న ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వ్యవహారం కాస్త పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో ఆ ఎమ్మెల్యే చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ఆ ఎమ్మెల్యే తీరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా సీరియస్‌గానే ఉన్నారట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? అసలేం జరిగింది?

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రూటే సపరేటు. డాక్టర్ వృత్తిలో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ చేసి న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడం లేదంటూ గతంలో ఆయన చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. ఇదే విషయంపై పలుమార్లు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు కూడా. లేటెస్ట్‌గా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే థామస్.

అగ్రవర్ణ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏం జరిగినా వార్తలు రావు..

మీడియా సమావేశం సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..సొంత ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మట్టి అక్రమ రవాణతో సహా ఏ చిన్న ఘటన జరిగినా మీడియాలో హైలెట్‌ చేస్తారని..అదే అగ్రవర్ణ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏం జరిగినా వాటిపై మీడియాలో కథనాలు రావడం లేదంటూ థామస్‌ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్‌గా మారాయి. అంతటితో ఆగకుండా ఆయన..పక్కనే ఉన్న చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి మట్టి అక్రమంగా బయటకు వెళ్లడం లేదా? వాటిని ఎందుకు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ..మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ మాటలు వైరల్‌ అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు స్వతహాగానే చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భానుప్రకాశ్‌లకు ఆగ్రహం తెప్పించినా..సొంత పార్టీ సహచర ఎమ్మెల్యే కావడంతో కౌంటర్ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. చివరకు థామస్ కామెంట్స్‌ పార్టీ అధిష్టానం చెవిన పడటంతో పార్టీ పెద్దలు సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాస్, థామస్‌ను సంజాయిషీ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో పల్లా శ్రీనివాస్ ను కలిసి తాను చేసిన వ్యాఖ్యలపై థామస్ వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విప్‌గాను కొనసాగుతున్న ఎమ్మెల్యే థామస్‌ను పార్టీ గట్టిగానే మందలించినట్లు చర్చించుకుంటున్నారు.

అయితే జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం థామస్ తీరుపై కొంతకాలంగా గుర్రుగానే ఉన్నారట. ఎస్సీ ఎమ్మెల్యేలు, అగ్రవర్ణ ఎమ్మెల్యేలు అంటూ జిల్లాలో ఎమ్మెల్యేలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారట. తనపై ఆరోపణలు వస్తే వాటిని ఖండించాల్సింది పోయి..పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలకు బురద అంటించడం ఏంటని జిల్లా ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారట. గతంలోనూ ఆయన ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని కూడా కొందరు ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. మరోసారి థామస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని ఒకరిద్దరు జిల్లా ఎమ్మెల్యేలు డిసైడ్ అయినట్లు టాక్.

Also Read: ఏపీలో లోకల్ వార్..! కూటమి పార్టీల ప్లానింగ్స్ ఏంటి? ఏకగ్రీవాలకు వైసీపీ చెక్ పెట్టగలదా?

AP Local Fight: ఏపీలో లోకల్ వార్..! కూటమి పార్టీల ప్లానింగ్స్ ఏంటి? ఏకగ్రీవాలకు వైసీపీ చెక్ పెట్టగలదా?
స్థానిక పోరుకు రెడీ అవుతున్న పార్టీలు.!

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం..సంసిద్ధం

వ్యూహాలకు పదును పెడుతున్న చంద్రబాబు

పట్టు పెంచుకునేందుకు జనసేన, బీజేపీ ప్లాన్స్

ఏకగ్రీవాలకు బ్రేకులు వేసే పనిలో వైసీపీ

AP Local Fight: యస్. ఇట్స్ టైమ్‌ టు లోకల్ ఫైట్. గెలిచి నిలవాల్సిందే. పట్టు నిరూపించాల్సిందే. క్లీన్‌ స్వీప్ చేయాల్సిందే. ఏపీలో స్థానిక పోరుపై ఎవరి లెక్కలు వారికున్నాయ్. ఇంకో నెల రోజుల్లో స్థానిక సమరం స్టార్ట్ కానుండటంతో..పార్టీలు ఇప్పటి నుంచే ఎవరి ఎత్తుల్లో వాళ్లు బిజీగా ఉన్నాయి. కూటమిలో ఆ మూడు పార్టీల ప్లానింగ్స్ ఏంటి? విపక్షంలో ఉన్న వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేనా? ఏకగ్రీవాలకు చెక్ పెట్టగలదా?

ఏపీ పాలిటిక్స్‌లో స్థానిక ఎన్నికల హడావుడి హీట్‌ను పెంచుతోంది. సీఎం చంద్రబాబు..అటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్..ఇటు వైసీపీ అధినేత జగన్‌ స్టేట్‌మెంట్స్‌తో.. ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్ మూమెంటమ్‌ స్పీడప్ అవుతోంది. ఇంకో ఒకటి, రెండు నెలల్లో లోకల్ ఫైట్‌కు సర్వం సిద్ధం చేస్తోంది సర్కార్. కలెక్టర్ల సదస్సు, రివ్యూలతో స్టేట్‌ ఈసీ బిజీ అయిపోయింది. ప్రభుత్వ పరంగానే కాదు ఇటు కూటమి పార్టీలు..విపక్ష వైసీపీ కూడా స్థానిక ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయ్. ఆల్రెడీ మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మరోవైపు స్థానిక ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని నేతలను హెచ్చరించిన ఆయన..అభ్యర్థుల గెలుపు బాధ్యతలు ఎమ్మెల్యే స్థాయి లీడర్లకు అప్పగించారు. గ్రామ స్థాయిలో బలం పెంచుకునే యోచనలో అటు బీజేపీ, ఇటు జనసేన పావులు కదుపుతున్నాయి.

పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు..!

ఇటు పార్టీ అగ్రనేతల కామెంట్స్..మరోవైపు ఎస్ఈసీ డెవలప్‌మెంట్స్‌తో..ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో టీడీపీ ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలుచుకున్న స్థానాలను తిరిగి కైవసం చేసుకుని పసుపు జెండా రెపరెపలాడించాలని పట్టుదలతో ఉంది. మహానాడు వేదికపైనా స్థానిక ఎన్నికలపై చర్చ జరిగింది. పార్టీ జెండా మోసిన వారికి పోటీ అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయంటున్నారు.

పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా టికెట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సంకేతాలిచ్చారాయన. ఇక ఇదే సందర్భంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ కూడా స్థానిక ఎన్నికలపై గురిపెట్టారు. ఏకగ్రీవాలు కాకుండా చూడాలని, ప్రతి స్థానంలోనూ పోటీ ఉండేలా అభ్యర్థులను ఇప్పటినుంచే రెడీ చేయాలని లీడర్లకు సూచించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ కాక రేక రేపుతోంది.

100 శాతం స్థానాలను గెలుచుకోవాలని టార్గెట్..

స్థానిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల మధ్యే గట్టి పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. కూటమిలో జనసేన, బీజేపీకి సీట్లు కేటాయించిన చోట..పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ భావిస్తోంది. 2021-22లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం స్థానాలను సొంతం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో 100 శాతం స్థానాలను గెలుచుకోవాలని టీడీపీ యోచిస్తోంది. వైసీపీపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన కూడా కీలక స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉంది. ఆయా జిల్లాల నుంచి ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కీలకమైన వార్డులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తగ్గేదేలే అన్న ఇండికేషన్ పంపిన జగన్…

మరోవైపు బీజేపీ కూడా తమకు బలం ఉన్నచోట అభ్యర్ధులను పోటీలోకి దించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఎన్నికలకు దూరంగా ఉండాలా..లేక పోటీ చేయాలా అనే డైలామాలో ఉన్న వైసీపీ ఇక అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. అధికార పక్షంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న ఫ్యాన్ పార్టీ..స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు సర్వం సిద్దం చేస్తోందట. రాష్ట్రస్థాయి కీలక నేతల సమావేశంలో స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు జగన్‌. ముఖ్యంగా ఏకగ్రీవాలు కాకుండా చూడాలని, అలా జరిగితే నియోజకవర్గ ఇంచార్జ్‌ల ఫెయిల్యూర్‌గా భావించాల్సి వస్తుందని ముఖ్యనేతలను హెచ్చరించారు. దీంతో స్థానిక పోరు విషయంలో తగ్గేదేలే అన్న ఇండికేషన్ పంపించారు వైసీపీ అధినేత జగన్.

ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో దాదాపు 13 వేల 326 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి న్యాయపరమైన చిక్కుల కారణంగా గతంలో ఎన్నికలు నిర్వహించ లేదు. ఇప్పుడు అన్ని పంచాయతీలకు ఎలక్షన్స్ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 660 జడ్పీటీసీ స్థానాలు, 10వేల 47కి పైగా ఎంపీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ పెట్టనుండటంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. అలాగే రాష్ట్రంలో 13 కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రకారం 920కు వార్డుల సంఖ్య పెరిగింది. 75 మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 2 వేలకు పైగా వార్డులు ఉన్నాయి. వీటన్నింటికీ కూడా రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్‌ ఈసీ కసరత్తు చేస్తోంది.

Also Read: మాట జారొద్దు, లైన్ దాటొద్దు.. దూకుడుగా వెళ్తున్న నేతలకు కేటీఆర్ క్లాస్?

KTR : మాట జారొద్దు, లైన్ దాటొద్దు.. దూకుడుగా వెళ్తున్న నేతలకు కేటీఆర్ క్లాస్?
బాల్క సుమన్ కామెంట్స్‌తో బీఆర్ఎస్ అలర్ట్?

నోరు జాగ్రత్త.. టంగ్ స్లిప్ కావొద్దని దిశానిర్దేశం..!

కేటీఆర్ సూచనతోనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దూకుడు తగ్గించారా?

KTR : రుకో జరా. సబర్ కరో. దూకుడు మంచిదే. కానీ లైన్ దాటొద్దు. టగ్ స్లిప్ కావొద్దు. అటెన్షన్ కోసమో..లేక మీడియాలో హైలెట్‌ కావడం కోసమో నోరు జారితే అసలుకే ఎసరు వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నాం. కాస్త జాగ్రత్త. ఆచితూచి మాట్లాడండి అంటూ..పార్టీ లీడర్లకు దిశార్దేశం చేశారట బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏది పడితే అది మాట్లాడి పార్టీని చిక్కుల్లో పడేయొద్దని.. కారు స్పీడుకు బ్రేకులు వేయొద్దని డైరెక్షన్స్ ఇచ్చారట. బాల్క సుమన్‌ ఎపిసోడ్‌తో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం..దూకుడుగా వెళ్తున్న నేతలను కంట్రోల్‌ చేసే ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

బహిరంగ సమావేశం అయినా..ఇంటర్నల్‌ మీటింగ్ అయినా..సోషల్ మీడియాలో పోస్ట్ అయినా..కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఏడిపడితే అది మాట్లాడి మీరు చిక్కుల్లో పడొద్దు. పార్టీకి ఇబ్బందులు తీసుకురావద్దు. కారు పార్టీ యువ నేతలకు..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లాస్ తీసుకున్నారంటూ గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. బాల్క సుమన్ ఎపిసోడ్‌తో అలర్ట్ అయిన గులాబీ పార్టీ అధిష్టానం దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్‌ నాయకులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విమర్శలు ధీటుగా సమాధానం చెప్పాల్సిందే కానీ వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు మాత్రం కంట్రోల్ తప్పొద్దని ఆదేశించినట్లు టాక్. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ వ్యాఖ్యలు, నమోదైన కేసులు, అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశముందని భావించి బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

వ్యవస్థలపై మాట్లాడేప్పుడు కంట్రోల్ తప్పొద్దు..

పార్టీ నాయకుల భాష, ప్రజా వేదికలపై వారు చేసే వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువనేతలు, సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉండే నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా సూచనలు జారీ చేసినట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ యువ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మరీ..ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల విమర్శలకు రాజకీయంగానే ప్రతి స్పందించాలని, అయితే ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, దర్యాప్తు సంస్థలు లేదా పరిపాలనా వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు లైన్ క్రాస్‌ చేయొద్దని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సీఎం రేవంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే వాటికి రాజకీయంగా ధీటుగా సమాధానం ఇవ్వాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత విమర్శలకు ప్రతి స్పందించే క్రమంలో పార్టీ నాయకులు చట్టపరమైన లేదా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకునేలా వ్యవహరించొద్దని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. కొంతకాలంగా బీఆర్ఎస్‌ నేతలపై కేసులు, అరెస్టులు ఎక్కువై పోతుండటంతో..పార్టీ నాయకత్వం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.

కౌశిక్ రెడ్డి దూకుడుకు కళ్లెం..!

బాల్క సుమన్‌ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీయగా, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పోరాటాన్ని మరింత వ్యూహాత్మకంగా కొనసాగించాలని డిసైడ్ అయినట్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇలా దూకుడుగా వెళ్లి వివాదాలు రాజేయడంతో ఆయనకు కళ్లెం వేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే బాల్క సుమన్ వ్యవహారం బీఆర్ఎస్‌కు రాజకీయంగా ఒక హెచ్చరికగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడే ఉద్దేశంతో నేతలు కంట్రోల్ తప్పి మాట్లాడి కేసుల పాలవకుండా..చట్టపరమైన సమస్యల్లో చిక్కకుండా..వివాదాల జోలికి వెళ్లకుండా చూసేలా పార్టీ అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.

Also Read: ఏపీ లానే తెలంగాణలోనూ పవన్ గెలుస్తాడని భయమా?- మంత్రి పొన్నం, కవితకు తెలంగాణ జనసేన కౌంటర్

Ponnam Prabhakar – Pawan Kalyan: సభ పెట్టావో సంగతి చూస్తాం..!- పవన్ కల్యాణ్ కు మంత్రి పొన్నం వార్నింగ్..
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ నవ నిర్మాణ సభ పేరుతో హైదరాబాద్ లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన సభ రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణతో మీకేం పని? అంటూ ఎదురుదాడికి దిగారు. మీ రాజకీయాలు ఆంధ్రాలోనే చేసుకోండి అని సీరియస్ అవుతున్నారు. తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ లు ఇస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కవిత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పవన్ టార్గెట్ గా చెలరేగిపోయారు.

బీజేపీ రెమ్యునరేషన్ తో పని చేస్తున్నారు..

పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో తెలంగాణ నవ నిర్మాణ సభ పెడతానడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. బీజేపీతో ఒప్పందం మేరకే పవన్ నటన ప్రారంభించారని మండిపడ్డారు. తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే ఆయన చెప్పే నవ నిర్మాణమా అని ప్రశ్నించారు పొన్నం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 రోజులు అన్నం మానేశానని గతంలో పవన్ చెప్పారని మంత్రి పొన్నం గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ అన్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. ఆ తర్వాతే తెలంగాణలో సభ పెట్టకోవాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేందుకే పవన్ బీజేపీ జెండా మోస్తున్నారని, బీజేపీ రెమ్యునరేషన్ తో పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి పొన్నం.

డిప్యూటీ సీఎంగా ఏమైనా చేయగలిగితే ఏపీలో చేసుకో. తెలంగాణకు వచ్చి నవ నిర్మాణ సభ అంటే ఇక్కడ సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము. వాస్తవంగా పవన్ కల్యాణ్ ఒక నటుడు. విలన్, గుండా, హీరో, ప్రేమికుడు.. సినీ జీవితంలో, నిజ జీవితంలో ఏం చేసినా అది మీ వ్యక్తిగతం. కానీ, తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదు. రెచ్చగొట్టేలా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణ వాతావారణాన్ని కలుషితం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోము.

బీజేపీతో రేటు ఫిక్స్ చేసుకుని తెలంగాణలో నటన స్టార్ట్ చేశారు పవన్ కల్యాణ్. మీ కన్న తల్లి అయిన తెలంగాణను అవమానపరిచారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు అని అన్నారు. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని అన్నారు. అటువంటి వ్యక్తిని ఇక్కడ మనం ఎంటర్ టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. పవన్ కల్యాణ్ ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. బీజేపీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి పవన్ చెప్పాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Also Read: తెలంగాణతో మీకేం పని? క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

Anirudh Reddy – Pawan Kalyan: తెలంగాణతో మీకేం పని? క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
Anirudh Reddy – Pawan Kalyan: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సభ రాజకీయ దుమారం రేపుతోంది. పవన్ కల్యాణ్ పై తెలంగాణ నాయకులు ఫైర్ అవుతున్నారు. అధికార, విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఆంధ్రా నాయకులకు తెలంగాణతో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. మీ రాజకీయాలు ఆంధ్రాలోనే చేసుకోండి తెలంగాణ జోలికి రావొద్దని వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం పవన్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కన్ను నరదిష్టి అన్న పవన్ కళ్యాణ్ కి తెలంగాణతో ఏం పని? అని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సభ విషయంలో మాకు అభ్యంతరం లేదన్న అనిరుధ్ రెడ్డి.. సభ ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చన్నారు. అయితే, గతంలో తెలంగాణ ప్రజలను అవమానించిన విషయంలో కచ్చితంగా పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ వాళ్లవి దిష్టి కళ్లు, మీ కళ్ల వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ చచ్చిపోయాయి అన్నందుకు పవన్ క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ వాళ్లను చిన్న చూపు చూసిన పవన్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలని తేల్చి చెప్పారు.

దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. నేను కూడా తమిళనాడులో పార్టీ పెట్టొచ్చు. కానీ నాకు తమిళ్ రాదే. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో నేను అరెస్ట్ చేయొద్దని చెప్పాను అని పవన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే పోలీసులు వింటున్నారా? ఏపీ నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్ముతుంటే .. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? వచ్చే ఎన్నికల్లో ఆంధ్రా పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని క్లారిటీ ఇస్తున్నారు.

ఉద్యోగుల విభజనలో ఏపీలో ఉన్న తెలంగాణ వాళ్లను ఇక్కడికి పంపండి. ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో స్వర్గంలో ఉన్నట్టు ఉన్నారు. ఏపీలో మన ఉద్యోగులు కష్టపడుతున్నారు. కొండగట్టుకు డబ్బులు టీటీడీ నుంచి ఇచ్చారు. పవన్ జేబులో నుంచి ఇవ్వలేదు. టీటీడీ హుండీలో ఎక్కువ డబ్బులు వేసేది తెలంగాణ వాళ్లవే. పవన్ సభపై బీజేపీ, బీఆర్ఎస్ మౌనం వెనుక రాజకీయ కారణం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి” అని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు.

Also Read: మా జోలికి వస్తే మూతి పళ్లు రాలతాయి..!- పవన్ కల్యాణ్‌కు కవిత వార్నింగ్..

Kavitha – Pawan Kalyan: మా జోలికి వస్తే..- పవన్ కల్యాణ్‌కు కవిత వార్నింగ్..
Kavitha – Pawan Kalyan: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలగొట్టి పార్సెల్ చేస్తామన్నారు. సెటిలర్స్ తమ వాళ్లే అన్న కవిత ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకునే రాజకీయ నాయకులను వదిలేది లేదని హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే సైలెంట్ గా ఉండేదే లేదన్నారు. టీఆర్ఎస్ 2.O తో పెట్టుకుంటే సంగతి చూస్తామని కవిత వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి పార్సల్ పంపుతామన్నారు. తమ అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతి రుద్దుతామంటే ఊరుకోము అని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ జెండా రాకముందు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ 2.0 తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయని హెచ్చరించారు. ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నామన్న కవిత.. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయని వార్నింగ్ ఇచ్చారు.

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు కవిత. ఆంధ్రాలో రాజధాని కట్టటం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ సీఎంగా ఉండటంతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్.. ముందు మీ సెక్రటేరియేట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోండి.. తర్వాత తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టుకోండి అని సూచించారు. తెలంగాణలో ఎక్స్ టెన్షన్ అవ్వటానికి లోకేష్ బాబు ఇది మీ సామ్రాజ్యం కాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజలు ఓట్లు వేయకపోవటంతోనే దుకాణం బంద్ పెట్టుకున్నది మర్చిపోయారా? అని నిలదీశారు కవిత.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సభ రాజకీయ దుమారం రేపుతోంది. పవన్ కల్యాణ్ పై తెలంగాణ నాయకులు ఫైర్ అవుతున్నారు. అధికార, విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఆంధ్రా నాయకులకు తెలంగాణతో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. మీ రాజకీయాలు ఆంధ్రాలోనే చేసుకోండి తెలంగాణ జోలికి రావొద్దని వార్నింగ్ లు ఇస్తున్నారు.

Also Read: 1.1 కోట్ల మందికి ప్రభుత్వం శుభవార్త.. వారి జీతాలు పెరగనున్నాయి.. నేటి నుంచే అమలు…

Pawan Kalyan-Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యేకి పవన్ కల్యాణ్ 4 వారాల డెడ్‌లైన్‌.. ఆంతర్యమేంటి?
వివాదాస్పద నేతలకు పవన్ వరుస క్లాసులు

పోలవరం ఎమ్మెల్యేకు 4 వారాల డెడ్‌లైన్‌

ఈ 4 వారాల డెడ్‌లైన్ వెనక ఆంతర్యమేంటి?

ఈ డెడ్‌లైన్‌ను బాలరాజు దాటగలరా ?

బాలరాజుకు ఎదురుకాబోయే సవాళ్లేంటి?

చిర్రి బాలరాజుకు ఉన్న సమస్యలేంటి ?

Pawan Kalyan-Chirri Balaraju: ఇన్నాళ్లు పాలన మీద పట్టు సాధించేందుకు టైమ్ కేటాయించిన పవన్.. ఇప్పుడు పార్టీని సెట్‌రైట్ చేసే పనిలో ఉన్నారు. వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, నేతలకు పిలిచి మరీ క్లాస్‌లు ఇస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు.. పవన్‌ నాలుగు వారాల డెడ్‌లైన్ విధించడం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్ అవుతోంది. ఈ నాలుగు వారాల్లో వివాదాల నుంచి ఆయన బయటపడగలరా.. ఇకపై బాలరాజుకు ఎదురుకాబోయే సవాళ్లేంటి..

పోలవరం రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో.. ఈ మధ్య జనసేనాని పవన్‌ వన్ టు వన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాములుగా రివ్యూలు అంటే నియోజకవర్గాల అభివృద్ధిపై జరుగుతాయ్. ఐతే వివాదాలపై ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న పవన్‌.. వాటిని సెట్‌రైట్ చేసుకునేందుకు నాలుగు వారాల డెడ్‌లైన్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. నాలుగు వారాల్లో బాలరాజు అంతా క్లియర్ చేసుకుంటారా.. ఒకవేళ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి.. అసలు ఆయనకు ఎందుకు పవన్ డెడ్‌లైన్‌ విధించారు.. ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి అని ఏపీ రాజకీయాల్లో డిస్కషన్ కనిపిస్తోంది.

నాలుగు వారాల్లో పనులు స్పీడప్ కావాల్సిందే..

పంచాయితీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 147 కోట్ల నిధులు కేటాయించగా.. క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై పవన్‌ నిలదీసినట్లు తెలుస్తోంది. నిధుల కేటాయింపు, టెండర్ల వెనక తప్పులు జరిగాయని విపక్షాలతో పాటు సొంత పార్టీలోనే ఆరోపణలు వినిపించడం పవన్‌కు కోపం తెప్పించింది. దీంతో నాలుగు వారాల్లో పనులు స్పీడప్ కావాలని.. ఆరోపణలకు చెక్‌ పెట్టాలని.. నాలుగు వారాల డెడ్‌లైన్ పెట్టి ఎమ్మెల్యేకు పవన్ అల్టిమేటం జారీ చేశారని టాక్.

గొడవలను 4 వారాల్లోగా పూర్తిగా చక్కదిద్దుకోవాలని వార్నింగ్..

చిర్రి బాలరాజుకు కేవలం ఆర్థిక, రాజకీయ చిక్కులే కాదు.. కుటుంబం నుంచి అంతకు మించిన తలపోటు ఉందనే చర్చ నడుస్తోంది. ఆయనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలు..జనసేన ప్రతిష్టను మసకబారుస్తున్నాయని.. సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయ్‌. పవన్‌ కల్యాణ్‌తో భేటీలో ఫ్యామిలీ మేటర్‌ చుట్టూ కూడా గట్టిగానే చర్చకు జరిగిందని తెలుస్తోంది. వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వివాదాలతో.. పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదని.. ఆ గొడవలను 4 వారాల్లోగా పూర్తిగా చక్కదిద్దుకోవాలని పవన్ వార్నింగ్ ఇచ్చారట.

ఇక అటు ఎమ్మెల్యే బాలరాజును టార్గెట్ చేస్తూ అధిష్టానానికి రోజుకో ఫిర్యాదు వెళ్తోందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులను.. బాలరాజు పక్కన పెట్టేశారట. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు.. ఎమ్మెల్యే వైఫల్యాలను, ఆరోపణలను ఎప్పటికప్పుడు సాక్ష్యాలతో సహా పార్టీ హెడ్‌ ఆఫీస్‌కు చేరవేస్తున్నారట. దీంతో పవన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. వైఫల్యాలు, వ్యక్తిగత వ్యవహారాలే కాదు..కేడర్‌ను కూడా కలుపుకుపోవాలని వార్నింగ్ ఇస్తూ.. పవన్ నాలుగు వారాల డెడ్‌లైన్ విధించారట.

త్వరలో ఏపీలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయ్‌. పోలవరం నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేయాలని కూటమి పార్టీలు టార్గెట్ పెట్టుకున్నాయ్. దీంతో పార్టీకి తన మార్క్ రిపేర్లు చేస్తున్నారు పవన్‌. కేడర్‌ను కూల్ చేయడంతో పాటు.. క్షేత్రస్థాయిలో ఏ చిన్న పొరపాటు కూడా కనిపించకూడదు అనుకునేలా.. బాలరాజుకు పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వాదనలు వినిపిస్తున్నాయ్. సేనాని ఇచ్చిన 4వారాల డెడ్‌లైన్‌లోగా.. ఫ్యామిలీ సమస్యలను సెటిల్ చేసుకుని, అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పరుగులు పెట్టించి.. కేడర్‌ను యాక్టివేట్‌ చేయాల్సిన బాధ్యత బాలరాజుదే! ఇదే ఇప్పుడు ఆయనకు అతిపెద్ద సవాల్‌గా మారే చాన్స్ ఉంది. మరి బాలరాజు ఏం చేస్తారు.. ఆయన ఎలాంటి అడుగులు వేస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. 4 వారాల్లో అంతా సెట్‌రైట్ చేసుకొని తనను తాను ప్రూవ్‌ చేసుకుంటారా అనే చర్చ.. పోలవరంలో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: తెలంగాణ రాజకీయాలపై పవన్ ఫోకస్? జూన్ 2న చేయబోయే ప్రకటనపై తీవ్ర ఆసక్తి..

Statue Politics: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాలిటిక్స్‌లో ట్విస్టులు..! తెలంగాణవాదులు ఎత్తుకున్న కొత్త నినాదమేంటి..
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాలిటిక్స్‌లో ట్విస్టులు!

తెలంగాణవాదుల తీరులో యూటర్న్ కనిపిస్తోందా?

వాళ్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందా?

తెలంగాణవాదుల ఎత్తుకున్న కొత్త నినాదమేంటి ?

విగ్రహాలకు, రాజకీయాలకు లింక్ కనిపిస్తోందా ?

Statue Row: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తెలంగాణ రాజకీయాలను మలుపులు తిప్పుతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రతిమకు, పాలిటిక్స్‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. అలానే ఉంది సీన్ మరి! ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం పేరు చెప్తే చాలు వ్యతిరేకించిన తెలంగాణవాదులు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? వాళ్ల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందా.. తెలంగాణవాదులు ఎత్తుకున్న కొత్త నినాదమేంటి.. దానికి కారణాలు ఏంటి..

రాష్ట్ర విభజనకు ముందు.. విభజన తర్వాత.. తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది అనేది కాదనలేని సత్యం. ఇప్పటికీ తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయ్‌. విడిపోయినా సరే.. వివాదాలు ఆగడం లేదు. ఏపీ, తెలంగాణ మధ్యలో.. నీటి పంపకాల కాంట్రవర్సీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ జల వివాదాలు తెలంగాణ రాజకీయ పార్టీలకు.. అస్త్రంగా మారుతూనే ఉన్నాయ్‌. ఇలాంటి తరుణంలో తెలంగాణవాదుల నుంచి కొత్త ప్రపోజల్ తెరపైకి వచ్చింది. ఇదే ఇప్పుడు రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత తెలంగాణవాదుల కొత్త ప్రతిపాదన..

ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాలను.. ఇక్కడ కూడా పెడుతోంది తెలంగాణ సర్కార్‌.. రవీంద్రభారతిలో ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ విగ్రహావిష్కరణ సమయంలో ప్రభుత్వంపై తెలంగాణవాదులు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని.. రవీంద్రభారతిలో ఎందుకు పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రశ్నించారు. ఆ వివాదంపై ఇప్పటికీ చర్చ జరుగుతుండగానే.. అమీర్‌పేట్‌ సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లారు. ఐతే అప్పుడు బాలు విగ్రహం టైమ్‌లో ఎదురైన విమర్శలే.. ఇప్పుడూ వస్తాయని అనుకున్నారట అంతా ! ఐతే దీని మీద పెద్దగా ఎలాంటి విమర్శలు రాలేదు. పైగా తెలంగాణవాదులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.

తెలంగాణకు మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించాలనే ప్రపోజల్..

ఏపీకి చెందిన బాలు, ఎన్టీఆర్ విగ్రహాలను తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్టించారని.. అలాగే తెలంగాణకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏపీ సర్కార్‌ ప్రతిష్టించాలనే ప్రపోజల్ పెడుతున్నారట తెలంగాణవాదులు. కళలకు, రాజకీయాలకు ప్రాంతీయ విబేధాలు ఉండవని కీలక సూచనలు చేస్తున్నారట. మాజీ ప్రధాని పీవీతో పాటు జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సినారె, కవి కాళోజీ, తెలంగాణకు చెందిన నటులు కాంతారావుతో పాటు.. భాగవతాన్ని తెలుగీకరించిన బమ్మెర పోతన విగ్రహల ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నారట. అమరావతిలో కృష్ణా నది ఒడ్డున, సచివాలయ పరిసరాల్లో ఈ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ.. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారట. తెలంగాణ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు వేయి మందిమి వచ్చి.. విగ్రహాలు తెచ్చి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా ప్రతిష్టించుకుంటామని.. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాణి రుద్రమ.

ఏపీలోనూ స్థలం చూపిస్తే తెలంగాణ వైతాళికుల విగ్రహాలు..

హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్‌, బాలు విగ్రహాలను ఏర్పాటు చేయటం ద్వారా.. రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటే అనే భావనను తెలంగాణ సీఎం రేవంత్ కలిగించారని.. అలానే ఏపీలోనూ స్థలం చూపిస్తే తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఏర్పాటు చేసి ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ రాణి రుద్రమ అంటున్నారు. గతంలో ఆంధ్ర ప్రాంతం నీడను కూడా వ్యతిరేకించే తెలంగాణవాదులు.. ఇప్పుడు ఇలాంటి కొత్త ప్రపోజల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఏపీ సర్కార్ ఈ విషయంలో ముందుకు వస్తుందా లేదో చూడాలి. ఒకవేళ ముందుకు వస్తే మాత్రం.. రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ తగ్గడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయ్‌.

Also Read: పెద్దల సభకు షర్మిల? ఇందులో నిజమెంత, కర్ణాటక నుంచే ఎందుకు?

Ys Sharmila: పెద్దల సభకు షర్మిల? ఇందులో నిజమెంత, కర్ణాటక నుంచే ఎందుకు?
షర్మిలకు రాజ్యసభ సీటు అంటూ ప్రచారం..

కర్ణాటక నుంచి పెద్దల సభకు పంపుతారని టాక్‌!

షర్మిలకు రాజ్యసభ సీటు ప్రచారంలో నిజం ఎంత?

కర్ణాటక నుంచే పంపిస్తారనే ప్రచారం ఎందుకు ?

అసలు కాంగ్రెస్ హైకమాండ్ మనసులో ఏముంది?

Ys Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు.. రాజ్యసభ సీటు ఇస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. కర్ణాటక నుంచి ఆమెను పెద్దల సభకు పంపుతారంటూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. సరిగ్గా రాజ్యస‌భ ఎన్నిక‌ల‌కు ముందు.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీని ష‌ర్మిల క‌ల‌వ‌డంతో.. ఈ విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఏది నిజం.. షర్మిలను నిజంగా రాజ్యసభకు పంపిస్తారా.. అదే నిజమైతే కర్ణాటక నుంచే ఎందుకు.. అసలు హస్తం పార్టీ వ్యూహాలు ఏంటి..

దక్షిణాది కాంగ్రెస్ రాజకీయాల్లో.. ఒక ఆసక్తికరమైన సమీకరణ తెరపైకి వచ్చింది. ఏపీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు అంటూ జరుగుతున్న ప్రచారం.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక అటు షర్మిల కూడా.. పార్లమెంట్‌లో అడుగుపెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని టాక్‌. దీని కోసం పక్క రాష్ట్రమైన కర్ణాటకను ఆమె వేదికగా ఎంచుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ముందుగా వైఎస్ఆర్‌టీపీ పేరుతో తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల.. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ సమయంలో అధిష్టానం తనకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ రాజ్యసభ బెర్త్ కోసం షర్మిల తన ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్లిన ఆమె.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి చర్చించారు. దీంతో షర్మిలకు రాజ్యసభ అవకాశం అనే ప్రచారం మరింత బలంగా వినిపిస్తోంది.

ఏపీ నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తే మంచి సంకేతాలు..

ఓవైపు షర్మిల ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో పాజిటివ్‌గానే ఉందనేది మరికొందరి నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ఏపీలో పార్టీని స్ట్రాంగ్ చేసే అంశంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళలో పార్టీ అధికారంలో ఉండటంతో.. దక్షిణాదిన బలహీనంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీపై ఆ పార్టీ ఫోకస్ చేసేందుకు రెడీ అయింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో.. ఏపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని చురుకుగా పనిచేసేలా.. పార్టీ ప్రస్తుత కార్యకర్తల్లో ఓ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. దీంతో షర్మిలకు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తన్నాయ్‌. అధిష్టానం దృష్టిలో కేవీపీ, రఘువీరా లాంటి నేతలు ఉన్నా.. షర్మిలవైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని హస్తిన వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు నోటిఫికేషన్‌..

ప్రస్తుతం కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. అందులో ఒకటి బీజేపీకీ వెళ్లిపోతే.. మూడు స్థానాలు హస్తం పార్టీకి దక్కుతాయ్‌. ఈ మూడింట్లో ఒకటి ఖర్గేకు ఖాయం. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి ఏపీకి ఇవ్వాలనే ఆలోచనతో ఉందట కాంగ్రెస్ హైకమాండ్‌. జూన్ 8 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో.. అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్‌లో తీవ్ర కసరత్తు జరుగుతోంది. దీంతో షర్మిల కూడా తన వైపు నుంచి పావులు కదుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్‌. పార్టీ పెద్దలతో వరుస భేటీల వెనక అసలు కారణం కూడా అదే అనే చర్చ జరుగుతోంది. ఇక అటు కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య కూడా.. తనకు రాజ్యసభకు వెళ్లే ఉద్దేశం లేదని క్లియర్‌ కట్‌గా చెప్పేశారు. ఇది షర్మిలకు మరింత అనుకూలంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌. ఇక అటు డీకేతో మంచి వ్యక్తిగత సంబంధాలు ఉండడం కూడా షర్మిలకు ప్లస్ అయ్యే చాన్స్ ఉంది.

సౌత్ సెంటిమెంట్‌కు పెద్ద పీట?

ఏపీలో పార్టీ పటిష్టం.. భవిష్యత్ కార్యాచరణ అనే కారణాలు చెప్తూ షర్మిల హస్తిన పర్యటనకు వెళ్లినా.. అసలు కారణం మాత్రం రాజ్యసభ అవకాశం కోసం ప్రయత్నాలే అనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మరి షర్మిలకు అవకాశం దక్కుతుందా.. జాతీయస్థాయి నేతలను పక్కనపెట్టి ఆమెకు అవకాశం కల్పిస్తారా.. లేదంటే సౌత్ సెంటిమెంట్‌కు పెద్ద పీట వేస్తారా.. కాంగ్రెస్ హైకమాండ్ మనసులో ఏముంది.. షర్మిలకు చాన్స్‌ దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. ఐతే షర్మిలకు కానీ అవకాశం ఇస్తే.. ఏపీ కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్లు అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మరి ఈ దిశగా పార్టీ పెద్దలు ఆలోచిస్తారా లేదో చూడాలి.

Also Read: టార్గెట్ తెలంగాణ..! తెలంగాణ రాజకీయాలపై పవన్ దృష్టి సారించారా? జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయనున్నారు?

Pawan Kalyan – Telangana Politics: తెలంగాణ రాజకీయాలపై పవన్ ఫోకస్? జూన్ 2న చేయబోయే ప్రకటనపై తీవ్ర ఆసక్తి..
తెలంగాణపై జనసేనాని ప్రత్యేక దృష్టి..

జూన్ 2న హైదరాబాద్‌లో కీలక సమావేశం

తెలంగాణలో రాజకీయంపై స్పష్టత ఇచ్చే చాన్స్‌!

టీడీపీ, బీజేపీతో కలిసి పార్టీ బలోపేతంపై ఫోకస్!

పవన్‌ సమావేశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి..

Pawan Kalyan – Telangana Politics: తెలంగాణ రాజకీయాలపై పవన్ దృష్టి సారించారా.. గ్రేటర్‌తో పాటు 2028 ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు వెళ్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున.. హైదరాబాద్‌లో పవన్ కీలక సమావేశం నిర్వహించడమే ఇందుకు నిదర్శనం అనే చర్చ నడుస్తోంది. మీటింగ్‌లో ఆయన కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నారా.. సరికొత్త రాజకీయ సమీకరణాలను తెరమీదకు తీసుకురాబోతున్నారా.. టీడీపీ, బీజేపీతో కలిసి వెళ్లబోతున్నారా.. లేదంటే సొంతంగా ప్రయత్నం చేస్తారా.. మీటింగ్ వేదికగా పవన్ ప్రకటనలు ఎలా ఉండబోతున్నాయ్‌..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. జూన్ 2న హైదరాబాద్‌లో జరగనున్న జనసేన పార్టీ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో అధికార కూటమిలో కీలకంగా ఉన్న జనసేన.. తెలంగాణలోనూ సంస్థాగత విస్తరణపై దృష్టి సారిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయ్‌. కొన్నేళ్లుగా ఆ పార్టీ ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయ్‌. దీంతో తెలంగాణలో పార్టీకి కొత్త జీవం పోయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు.. 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం కేడర్‌ను స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన జనసేన నాయకత్వంలో కనిపిస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర ఏంటి..

హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమావేశానికి.. జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు, కీలక కార్యకర్తలు, యువజన విభాగ ప్రతినిధులు హాజరు కానున్నారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, యువతను ఆకర్షించే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి లాంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీలో అధికార బాధ్యతలతో పాటు.. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర ఏంటి.. భవిష్యత్‌లో పార్టీ ఎలా ముందుకు సాగాలి.. టీడీపీ, బీజేపీతో సమన్వయం ఏ స్థాయిలో ఉండాలి అనే అంశాలపై పవన్ స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయ్‌.

బీజేపీ, జనసేన, టీడీపీ బంధానికి కొత్త రూపు..

హైదరాబాద్‌ బీజేపీ సభకు వచ్చినప్పుడు ఇంటికి వెళ్లి మరీ పవన్‌ను కలిసి పరామర్శించారు మోదీ. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి సమావేశం అయ్యారు. అటు పవన్‌తో.. ఇటు చంద్రబాబుతో మీటింగ్‌లో.. అభివృద్ధి అంశాల మీదే చర్చ జరిగిందనే ప్రచారం జరిగినా.. అంతకుమించి అనే చర్చ మొదలైంది. ఏపీతో పాటు తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ముగ్గురి మధ్య చర్చ జరిగి ఉండొచ్చనే విశ్లేషణలు వినిపించాయ్‌. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ.. తన బలాన్ని పెంచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు.. పట్టణ ప్రాంతాల్లో పార్టీని స్ట్రాంగ్‌ చేయడంపై కమలనాథులు సీరియస్‌గా దృష్టి సారించారు.

స్థానిక ఎన్నికలు.. జీహెచ్‌ఎంసీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొనే.. మే 10న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ జరిగిందనే టాక్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని తెలంగాణలో యాక్టివ్‌గా చేయడం ద్వారా.. బీజేపీ జనసేన టీడీపీ బంధానికి కొత్త రూపు తీసుకురావాలని పవన్ ప్రయత్నిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్‌. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ లాంటి ప్రాంతాల్లో.. ఆంధ్రా మూలాలున్న ఓటర్లు, యువత, సినీ అభిమానులను ఆకర్షించే సామర్థ్యం పవన్ కు ఉందని కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయ్‌.

రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పం..

జూన్‌ 2.. తెలంగాణ జనాలకు ఎమోషనల్ డే. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమావేశాన్ని నిర్వహించడం ద్వారా.. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గౌరవిస్తున్నామనే సందేశాన్ని జనసేన ఇవ్వాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీకే పరిమితం కాకుండా.. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పాన్ని ఈ వేదిక ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. ఇది కేవలం పార్టీ కార్యకర్తల సమావేశమే కాకుండా.. తెలంగాణలో జనసేన భవిష్యత్ పాత్రపై దిశా నిర్దేశం చేసే వేదికగా మార్చుకునే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలా.. టీడీపీ, బీజేపీతో వ్యూహాత్మక సమన్వయంతో ముందుకు వెళ్లాలా అనే అంశాలపై.. నేతలకు, కార్యకర్తలకు పవన్‌ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జరగనున్న సమావేశం.. తెలంగాణలో జనసేన పార్టీ కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభించే ప్రయత్నంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: కేసీఆర్ మీద ఒట్టేసి బీజేపీలో చేరనని చెప్పగలరా? హరీశ్ రావుకి సీఎం రేవంత్ సవాల్