Aam Aadmi Party: బీజేపీలో చేరితే నలుగురు ఆప్ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల చొప్పున ఇస్తామని మంతనాలు జరిపారు: ఎంపీ సంజయ్ సింగ్

ఢిల్లీలోని తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలని, లేదంటే నకిలీ కేసులు, సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటారని వారిని ఆ పార్టీ హెచ్చరించిదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇవాళ ఢిల్లీలో ఆప్ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ''మా పార్టీ ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్ నాథ్ భారతీ, కుల్దీప్ తో కొందరు బీజేపీ నేతలు మంతనాలు జరిపారు. పార్టీ మారితే ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఇస్తామని, వారితో పాటు ఇతర ఆప్ ఎమ్మెల్యేను బీజేపీలో చేరేందుకు ఒప్పించి తీసుకొస్తే రూ.25 కోట్లు ఇస్తామని చెప్పారు'' అని అన్నారు.

Aam Aadmi Party: బీజేపీలో చేరితే నలుగురు ఆప్ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల చొప్పున ఇస్తామని మంతనాలు జరిపారు: ఎంపీ సంజయ్ సింగ్

Aam Aadmi Party

Aam Aadmi Party: ఢిల్లీలోని తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలని, లేదంటే నకిలీ కేసులు, సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటారని వారిని ఆ పార్టీ హెచ్చరించిదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇవాళ ఢిల్లీలో ఆప్ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ”మా పార్టీ ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్ నాథ్ భారతీ, కుల్దీప్ తో కొందరు బీజేపీ నేతలు మంతనాలు జరిపారు. పార్టీ మారితే ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఇస్తామని, వారితో పాటు ఇతర ఆప్ ఎమ్మెల్యేను బీజేపీలో చేరేందుకు ఒప్పించి తీసుకొస్తే రూ.25 కోట్లు ఇస్తామని చెప్పారు” అని అన్నారు.

”ఒకవేళ బీజేపీలో చేరేందుకు ఒప్పుకోకపోతే నకిలీ కేసులు పెడతామని, సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటామని అన్నారు. ప్రస్తుతం మనీశ్ సిసోడియా ఎదుర్కొంటోన్న మాదిరిగానే విచారణ ఎదుర్కొంటారని బీజేపీ నేతలు బెదిరించారు” అని చెప్పారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు జరుపుతోందని, ఆప్ నేతలను చేర్చుకోవాలని భావిస్తోందని అన్నారు.

కాగా, ఈ మీడియా సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్ నాథ్ భారతీ, కుల్దీప్ కూడా పాల్గొన్నారు. కాగా, ఢిల్లీలో ఇప్పటికే మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ సీబీఐ విచారణ ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు అంశాలను గుర్తు చేసేలా ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు ఉన్నాయి.

Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..