ముహూర్తం ఫిక్స్ : 7న టీడీపీలోకి మహేష్ బాబాయ్

గుంటూరు : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు టీడీపీలో చేరడం కన్ఫామ్ అయ్యింది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 3, 2019 / 03:32 PM IST
ముహూర్తం ఫిక్స్ : 7న టీడీపీలోకి మహేష్ బాబాయ్

గుంటూరు : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు టీడీపీలో చేరడం కన్ఫామ్ అయ్యింది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.

గుంటూరు : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు టీడీపీలో చేరడం కన్ఫామ్ అయ్యింది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని ఆదిశేషగిరిరావు ప్రకటించారు. ఏపీలో మరోసారి చంద్రబాబే రావాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు పాలన బాగుందని కితాబిచ్చారు. చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ప్రశంసించారు.

 

2019, జనవరి 3వ తేదీ ఆదివారం గుంటూరులోని ఘట్టమనేని ఆదిశేషగిరిరావు…ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య , ఎమ్మెల్యేలు అలపాటి రాజా, గద్దె రామ్మోహన్, జలీల్‌ఖాన్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు…బుర్రిపాలెంలోని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లారు. టీడీపీలో చేరాలని ఆదిశేషగిరిరావును ఆహ్వానించారు. దీనికి ఆయన సమ్మతం తెలిపారు. ఆదిశేషగిరిరావు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పలు మార్లు సమావేశమయ్యారు. ఇప్పుడు టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు.