Go Back Modi: తమిళనాడులో మోదీకి మరోసారి నిరసన సెగ.. ‘గో బ్యాక్’ అంటూ తమిళుల నినాదాలు

ఈక రాష్ట్ర గవర్నర్ రవికి సైతం నిరసన సెగ తప్పలేదు. ఆయన పేరుతో ‘గోబ్యాక్‌రవి’ (GobackRavi) అనే నినాదం కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. తిరునల్వేలి జిల్లా కూడన్‌కుళంలో ఏర్పాటైన అణువిద్యుత్‌ కేంద్రానికి, స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా రేగిన ఆందోళనలను ప్రస్తావిస్తూ, ఆ రెండు ఆందోళనలకు విదేశాల నుంచి నిధులు సమకూరాయని గవర్నర్ రవి ఆరోపించారు

Go Back Modi: తమిళనాడులో మోదీకి మరోసారి నిరసన సెగ.. ‘గో బ్యాక్’ అంటూ తమిళుల నినాదాలు

#GoBackModi protest in TN (file photo)

Go Back Modi: తమిళనాడు (Tamilnadu)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi)కి నిరసన ఎదురవడం కొత్తేం కాదు. ఆయన ఎప్పుడు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లినా.. రోడ్ల మీద మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపిస్తాయి. అలాగే సోషల్ మీడియా (Social Media)లో ‘గో బ్యాక్ మోదీ’ అనే ట్రెండ్ సర్వసాధారణం అయిపోయింది. తాజాగా చెన్నై విమానాశ్రయంలోని న్యూ ఇంటిగ్రేడెడ్ టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం రోజున తమిళనాడుకు మోదీ వెళ్లనున్నారు. అంతే, ఇప్పటి నుంచే నెటిజెన్లు ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నినాదాలు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని చోట్ల నిరసన పోస్టర్లు సైతం వెలిసాయి. సామాజిక మాధ్యమాల్లో ‘మీమ్‌’లు హోరెత్తాయి. ఈ పరిణామాలతో ‘గోబ్యాక్‌మోదీ’ (GoBackModi) నినాదం తాజాగా ట్రెండింగ్ అవుతోంది. బీజేపీ మీద వ్యతిరేకతతో పాటు కొంత కాలంగా తమిళనాడు గవర్నర్ రవి వ్యవహార శైలి కూడా తాజా పరిస్థితులకు ఆజ్యం పోసింది.

Manish Sisodia: చదువుకున్న ప్రధాని కావాలంటూ ఏకంగా మోదీకే లేఖ రాసిన సిసోడియా

దేశంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ తమిళనాడులో జీరో అంటూ ఒక ట్విట్టర్ యూజర్ గత ఎన్నికల ఫలితాలతో కూడిన మ్యాప్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దానికి #GobackModi అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చాడు. ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి మోదీ వస్తుంటే ఆయన జూనియర్ మినిస్టర్ సింధియా చెప్పుల స్టాండులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటూ మరొకరు విమర్శలు గుప్పించారు. ‘గో బ్యాక్ మోదీ’ నినాదాలు రాసి ఉన్న బెలూన్లను ఎగురవేసేందుకు ఓ ట్విట్టరాటీ సిద్ధపడుతుండగా, బస్టాండ్ ప్రాంతాల్లో గోబ్యాక్‌మోదీ పోస్టర్లు వెలియడం, ఓ స్తంభానికి కట్టిన మోదీ పోస్టర్‌కు చెప్పులదండ వేసిన మరో పోస్టర్.. ఇలా సామాజిక మాధ్యమాల్లో పలు ఫోటోలు, మీమ్‌లు దర్శనమిస్తున్నాయి.

Amit Shah: దేశంలో ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం కాదు.. ఏం ప్రమాదంలో పడిందో తెలుసా?: అమిత్ షా

ఈక రాష్ట్ర గవర్నర్ రవికి సైతం నిరసన సెగ తప్పలేదు. ఆయన పేరుతో ‘గోబ్యాక్‌రవి’ (GobackRavi) అనే నినాదం కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. తిరునల్వేలి జిల్లా కూడన్‌కుళంలో ఏర్పాటైన అణువిద్యుత్‌ కేంద్రానికి, స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా రేగిన ఆందోళనలను ప్రస్తావిస్తూ, ఆ రెండు ఆందోళనలకు విదేశాల నుంచి నిధులు సమకూరాయని గవర్నర్ రవి ఆరోపించారు. ఇటీవలే ఆయన తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో అధికార డీఎంకే సహా తమిళ రాజకీయ పార్టీలన్నీ గవర్నర్ మీద నిప్పులు చెరిగాయి. ఎట్టకేలకు గవర్నర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పినప్పటికీ నిరసన మాత్రం తప్పడం లేదు.