ఇదిగో అమరావతి : కొత్త మ్యాప్ ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 01:54 AM IST
ఇదిగో అమరావతి : కొత్త మ్యాప్ ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా విడుదల చేసిన భారత రాజకీయ మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించక పోవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పందించారు. ఏపీ మినహా దేశంలో 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు, వాటి రాజధానుల పేర్లను ముద్రించిన ఈ మ్యాప్ అమరావతిని గుర్తించలేదు.

దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం (నవంబర్ 22, 2019)న ట్విట్టర్ ద్వారా స్పందించారు. లోక్ సభ శీతాకాల సమావేశాల సందర్భంగా ఓ ప్రకటన చేశారు. ఈ తప్పును సరిచేశానని తెలిపారు. అమరావతిని గుర్తిస్తూ.. కొత్త మ్యాప్ ను విడుదల చేశామని తెలిపారు. 

అంతేకాదు రాజధాని అమరావతిని గుర్తించకపోవడంలో పొరపాటులో జరిగింది తప్ప వేరే ఉద్దేశం లేదని..  తప్పును సరి చేశామని చెప్తూ.. తన ట్విట్టర్ లో కొత్త మ్యాప్ ను విడుదల చేశారు.