ఎవరికి వారే : ప్రకాశం జిల్లా మొత్తం గ్రూపు రాజకీయాలే

  • Published By: madhu ,Published On : January 24, 2019 / 01:42 PM IST
ఎవరికి వారే : ప్రకాశం జిల్లా మొత్తం గ్రూపు రాజకీయాలే

ప్రకాశం జిల్లా టీడీపీలో గ్రూపు రాజకీయాలు
కొండేపి నుంచి మొదలైన ఈ గ్రూపు రాజకీయాలు. 
సంతనూతలపాడు, కనిగిరి, పర్చూరుకు పాకిన వైనం
వర్గాలుగా మారి పార్టీకి తలనొప్పి తెప్పిస్తున్న నేతలు
టిక్కెట్ తమకంటే తమకంటూ ఆధిపత్య పోరు
జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌పై నేతల ఆగ్రహం
గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణ
అధిష్టానానికి కంప్లెంట్‌ చేసిన నేతలు
ప్రకాశం :
జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గాల్లో నాయకులు గ్రూపులుగా మారి పార్టీకి తలనొప్పిగా తయారవుతున్నారు. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే.. మరోవైపు నాయకులు టిక్కెట్ తమకంటే తమకంటూ రోడ్డునపడుతున్నారు. అయితే గ్రూపు రాజకీయాలను ప్రకాశం జిల్లా తెలుగు దేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ వెనుక నుండి ప్రొత్సహిస్తున్నాడని .. సిట్టింగ్‌లు మండిపడుతున్నారు. కొండేపి నియోజకవర్గం నుంచి మొదలైన ఈ గ్రూపు రాజకీయాలు.. సంతనూతలపాడు, కనిగిరి, పర్చూరు  నియోజకవర్గాలకు పాకింది. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను కాదని కొత్త వారిని దామచర్ల జనార్థన్ తెరమీదకు తీసుకువస్తున్నారని.. నాయకులు ఫైర్ అవుతున్నారు. దామచర్ల జనార్థన్ సొంత నియోజకవర్గం కొండేపి ఎస్సీ రిజర్వుడు కావడవడంతో.. ఈ నియోజక వర్గంలో దామచర్ల కుటుంబ సభ్యులు బాలవీరాంజనేయ స్వామిని సపోర్టు చేశారు. గత ఎన్నికల్లో ఆయనకు వెన్నదన్నుగా నిలచి దగ్గరుండి గెలిపించారు. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను దివంగత నేత దామచర్ల ఆంనేయులు కాలం నుంచి నేటివరకు దామచర్ల కుటుంబమే చూస్తుంది. అందులో భాంగంగా జనార్థన్ బాబాయి కొడుకు దామచర్ల సత్య ఆ భాద్యతలను నిర్వర్తిస్తున్నాడు. దీంతో ఫైర్ అయిన జనార్ధన్ తన సొంత నియోజక వర్గంలో తన పెత్తనం చెల్లడం లేదంటూ ఫీలైపోయారట. అంతేకాదు గతంలో ఇదే నియోజక వర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన జూపూడి ప్రభాకర్‌ని ..  తెరమీదకు తీసుకువచ్చారు. ఈ విషయం కాస్త ఎమ్మెల్యే స్వామి, సత్య వర్గం చెవిన పడటంతో .. స్ధానిక కొండేపి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయారు. జనార్థన్ వర్గీయులు వ్యతిరేకంగా మారి ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యే స్వామి.. పార్టీ నేతలు ముందు వాపోతున్నారట. 
కొండేపి నుంచి మొదలైన గ్రూపు రాజకీయాలు
సంతనూతలపాడు, కనిగిరి, పర్చూరు  
కొండేపి ఎస్సీ రిజర్వుడు 
బాలవీరాంజనేయ స్వామికి సపోర్టు
దామచర్ల ఆంనేయులు కాలం నుంచి 
దామచర్ల సత్య భాద్యతలు

సంతనూతలపాడులోనూ ఇదే సీన్ క్రియేట్ అయింది. ఒంగోలు-కర్నూలు రహదారి పనులు కాంట్రాక్ట్ వ్యవహారంలో దామచర్ల జనార్థన్‌కి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బి.ఎన్.విజయ్‌కుమార్ మధ్య వివాదం తలెత్తింది. దీంతో విజయ్‌కుమార్‌కి వ్యతిరేకంగా జనార్థన్ తన వర్గీయులను రంగంలోకి దింపారట. ఈ స్థానంలో విజయ్‌కుమార్‌ని పక్కన పెట్టించి వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజుని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ వర్గాల టాక్. దీంతో విజయ్‌కుమార్ తన పరిస్థితిని పార్టీ నాయకుల వద్ద మొరపెట్టుకున్నాడట.  
సంతనూతలపాడులోనూ ఇదే సీన్ 
ఒంగోలు-కర్నూలు రహదారి పనుల కాంట్రాక్టు  
జనార్థన్‌కి, బి.ఎన్.విజయ్‌కుమార్ మధ్య వివాదం 
డేవిడ్ రాజుని రంగంలోకి దింపాలని ప్రయత్నం

కనిగిరి నియోజకవర్గంలోనూ సేమ్ సీన్. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుని కాదని మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని జనార్థన్ తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేశారట. దీంతో చిర్రెత్తుకొచ్చిన కదిరి బాబూరావు తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపారట. కదిరి బాబూరావు విషయంలో బాలకృష్ణ జోక్యం చేసుకోవడంతో జనార్థన్ సైలెంట్ అయ్యాడని సమాచారం. పర్చూరు నియోజకవర్గంలో సైతం సేమ్ టు సేమ్ సీన్ ఏర్పడింది. నియోజక వర్గంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు వ్యతిరేకంగా గ్రూపులు ప్రోత్సాహిస్తున్నారని ఏలూరి వర్గం భావిస్తొంది. ఈ విషయాన్ని గ్రహించిన ఏలూరి డైరెక్ట్‌గా జిల్లా అధ్యక్షుడు జనార్ధన్‌కే ఫోన్ చేసి గ్రూపులపై చర్చించడంతో పాటు పద్దతి మార్చుకోకపోతే అదిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.
కనిగిరి నియోజకవర్గంలోనూ సేమ్ సీన్
కదిరి బాబూరావుని కాదని 
తెరపైకి ఉగ్ర నరసింహారెడ్డి 

వాస్తవానికి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచింది ఒకే ఒక్కసారి. దీనికే జిల్లాలో ఇన్ని గ్రూపు రాజకీయాలు చేస్తే ఆయన మళ్లీ గెలిస్తే పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అంటూ జిల్లా టీడీపీ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. ప్రస్తుతం జనార్ధన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నాయకులు వచ్చే ఎన్నికల్లో ఒంగోలులో దామచర్లను ఓడించడానికి తెరవెనుక ప్రయత్నాలు చేసేందుకు సిద్దమవుతున్నారని టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి.