Gujarat AAP: ఎమ్మెల్యేలుగా గెలిచి రెండ్రోజులు కాలేదు, అప్పుడే బీజేపీలోకి జంపింగ్‭లు.. మొదటిసారి ఫిరాయింపుల్ని ఎదుర్కొంటున్న ఆప్!

వాస్తవానికి గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కూడా తెచ్చిపెట్టింది. కానీ అంతలోనే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే సంఘటనలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గుజరాత్‌లో కొత్తగా గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతుండటం ఆ పార్టీ వర్గాల్లో కలవరం పుట్టిస్తోంది. ఐదుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరకుండా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఏమేరకు కట్టడి చేస్తారో చూడాలి.

Gujarat AAP: ఎమ్మెల్యేలుగా గెలిచి రెండ్రోజులు కాలేదు, అప్పుడే బీజేపీలోకి జంపింగ్‭లు.. మొదటిసారి ఫిరాయింపుల్ని ఎదుర్కొంటున్న ఆప్!

Gujarat headache for AAP: 'Five party MLAs in touch with BJP'

Gujarat AAP: ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్తగా ఫిరాయింపుల బాధలు ఎదురవుతున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులు కూడా పూర్తిగా గడవలేదు, అప్పుడే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ టికెట్‭పై గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు గతంలో బీజేపీ నేతలే. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు టికెట్ కోసం ఆప్‭లో చేరారు.

MCD Polls: ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ బీజేపీ చీఫ్ పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా

బీజేపీ అధినాయకత్వంతో వీరంతా టచ్‌లో ఉన్నారని సమాచారం. ఫలితాల్లో బీజేపీ సునామీ సృష్టించడంతో వీరు కూడా కమలదళంలో కలిసేందుకు సిద్ధమౌతున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా బీజేపీలో చేరేందుకు ఇప్పటికే బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆప్ 13 శాతం ఓట్ బ్యాంక్ సాధించి, ఐదు అసెంబ్లీ స్థానాల్ని గెలిచింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందే జంపింగ్ చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు సిద్ధమైపోవడం ప్రకంపనలు రేపుతున్నాయి.

World Bank Report: ఇండియాలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ పని చేస్తున్నారు