WFI chief Brij Bhushan: నిన్న సెటైర్లు వేశారు, ఈరోజు ఉరితీయమంటూ ఎమోషనల్ అయ్యారు.. రెజ్లర్ల నిరసనపై ఒక్క రోజులోనే మారిన బ్రిజ్ భూషణ్ స్వరం

మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ భూషణ్ శరణ్ లైంగికంగా వేదిస్తున్నాడని అగ్రశ్రేని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. భూషణ్ శరణ్‌పై చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేసి, అతన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ షోఘట్, ఇతరులు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు

WFI chief Brij Bhushan: నిన్న సెటైర్లు వేశారు, ఈరోజు ఉరితీయమంటూ ఎమోషనల్ అయ్యారు.. రెజ్లర్ల నిరసనపై ఒక్క రోజులోనే మారిన బ్రిజ్ భూషణ్ స్వరం

WFI chief Brij Bhushan

WFI chief Brij Bhushan: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లపై ఆదివారం ఎద్దేవా వ్యాఖ్యలు చేసిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్వరం ఒక్క రోజులోనే మారిపోయింది. అవసరమైతే తనను ఉరితీయండి కానీ, ఆటను మాత్రం ఆపొద్దంటూ సోమవారం భావోద్వేగానికి లోనయ్యారు. నాలుగు నెలలుగా క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయాయని అన్న ఆయన పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ నిరసన చేస్తున్న రెజ్లర్లను వేడుకున్నారు.

Chhattisgarh: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ట్రైబల్ బిగ్ బాస్

‘‘14 సంవత్సరాల 9 నెలల వయస్సు ఉన్న బిడ్డ మరో మూడు నెలల్లో 15 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అలా జరిగితే వారు జాతీయ స్థాయికి పనికిరాకుండా పోతారు. ఈ విషయాన్ని రెజ్లర్లు అర్థం చేసుకోవాలి. మీకు అంతగా కావాల్సి వస్తే.. నన్ను ఉరి తీయండి. కానీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలు జరగనివ్వండి’’ అని బ్రిజ్ భూషణ్ అన్నారు. ఇక రెజ్లర్ల నిరసనపై ఆయన ఆదివారం స్పందిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినంత మాత్రాన న్యాయం దొరకదంటూ ఎద్దేవా చేశారు. “మీకు జంతర్ మంతర్ నుంచి న్యాయం జరగదు. న్యాయం కావాలంటే పోలీసులు, కోర్టుకు వెళ్లాలి. వారు ఇప్పటివరకు అలా చేయలేదు. కోర్టు ఏది తీర్పు ఇచ్చినా నేను అంగీకరిస్తాను’’ అని అన్నారు.

China: పట్టణాల్లో ఉద్యోగాల్లేవ్, వెంటనే గ్రామాలకు వెళ్లి పని చేసుకోండి.. యువతకు ప్రభుత్వం సలహా

మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ భూషణ్ శరణ్ లైంగికంగా వేదిస్తున్నాడని అగ్రశ్రేని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. భూషణ్ శరణ్‌పై చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేసి, అతన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ షోఘట్, ఇతరులు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. గతంలో వీరు ఆందోళన చేపట్టగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖల మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాక, విచారణకు సంబంధించిన కమిటీని కూడా నియమించారు. అప్పుడు రెజ్లర్లు ఆందోళన విరమించారు. గత వారంరోజుల క్రితం భూషణ్ శరణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.

Azam Khan: రివేంజ్ అలా ఉంటుంది, ఒక్క ముక్క కూడా దొరకలేదు.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణంపై అజాం ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే.. ఏడుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారణ జరిపి ఢిల్లీ పోలీసులు, ఇతరులకు నోటీసులు జారీచేసింది. శుక్రవారంకు విచారణ వాయిదా వేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు జరిపిన విచారణలో బ్రిజ్ భూషణ్ సింగ్ పై కేసు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసుల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రుచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. వెంటనే కొద్దిగంటలకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇదిలాఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. రెజ్లర్లు ఆందోళన విరమించలేదు. ఢిల్లీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రెజ్లర్లు తెలిపారు.