ఆర్టీసీ సమ్మె..నేడైనా తేలేనా : రూట్ల కేటాయింపులపై విచారణ

  • Published By: madhu ,Published On : November 22, 2019 / 12:40 AM IST
ఆర్టీసీ సమ్మె..నేడైనా తేలేనా : రూట్ల కేటాయింపులపై విచారణ

ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై.. ఉత్కంఠ కొనసాగుతోంది. రూట్ల ప్రైవేటీకరణపై 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పు తర్వాతే.. ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది. దీంతో.. కోర్టు తీర్పు వెలువరిస్తుందన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని యధావిధిగా నడపలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయం అనంతరం సీఎం కేసీఆర్ మరోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని, సమ్మె విరమణ ప్రతిపాదనపై నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే..సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో..అది తేలిన తర్వాతే..వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

సమ్మె విరమణకు సిద్ధమని జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో 2019, నవంబర్ 21వ తేదీ గురువారం కార్మికుల నిరసనలు అంతంతమాత్రంగానే సాగాయి. 48 రోజుల పాటు ఉధృతంగా సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. గురువారం మాత్రం చాలా తక్కువ సంఖ్యలో కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ డిపోలకు వద్దకు వెళ్లారు. కొంతమంది మాత్రం జేఏసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..డిపోల ఎదుట నిరసనలు నిర్వహించారు. మరోవైపు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్నారు. మొత్తంగా నేడైనా ఈ అంశం తేలుతుందా ? లేదా ? అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. 
Read More : బ్రేకింగ్ : ఆర్టీసీని మోయలేం..యథాతథంగా నడపలేం