Digvijaya Singh: హిందుత్వం ధర్మం కాదట, బజరంగ్ దళ్ గూండాల గ్రూపట.. కొత్త కాంట్రవర్సీకి తెరలేపిన దిగ్గీ

మనది సనాతన ధర్మం. హిందుత్వను ధర్మంగా మనం పరిగణించము. ధరమ్ కీ జై హో, అధర్మ్ కా నాష్ హో, ప్రాణియోం మే సద్భావన్ హో, విశ్వ కా కల్యాణ్ హో.. అనేవి సనాతన ధర్మ నినాదాలు. అయితే హిందుత్వ విషయంలో అలా కాదు. హిందుత్వ అంటే..

Digvijaya Singh: హిందుత్వం ధర్మం కాదట, బజరంగ్ దళ్ గూండాల గ్రూపట.. కొత్త కాంట్రవర్సీకి తెరలేపిన దిగ్గీ

Hindutva and Bajrang Dal: కర్ణాటక ఎన్నికలకు ముందు బజరంగ్ దళ్‭ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం వివాదాస్పదమైంది. రైట్ వింగ్ గ్రూపుల నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు ఎదుర్కొంది. అంతే కాదు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయితే దీన్నే ఎన్నికల అస్త్రంగా మలుచుకుని ప్రచారం చేశారు. ఇది గమనించిన ఆ పార్టీ బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో ఏమీ పెట్టలేదని సర్ది చెప్పుకుంది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఎన్నికల్లో బజరంగ్ దళ్ ప్రభావం ఏమీ లేదని తేలిపోయింది.

Supreme Court : గంగా, యమునా నదుల ప్రక్షాళనపై దాఖలైన పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఇక ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్లే అయింది. కానీ ఈ వివాదాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వదిలిపెట్టలేదు. పైగా దీనికి తోడు హిందుత్వను కూడా లాగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వం అనేది ధర్మం కాదని, ఆ పేరుతో దాడులకు పాల్పడటాన్ని తాము అంగీకరించమని ఆయన అన్నారు. సామరస్యం, అందరి సంక్షేమం కోరుకునే సనాతన ధర్మాన్నద తాను నమ్ముతానని అన్నారు. ఇక బజరంగ్ దళ్ విషయంలో ఒక మెట్టు పైకే ఎక్కి.. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజ్‌రంగ్ దళ్‌ను ‘గూండాల గ్రూపు’గా అభివర్ణించారు.

Karnataka CM: డీకేకు రాజస్థాన్ భయం.. సిద్ధరామయ్య చేసిన సీఎం షేరింగ్‭ ప్రతిపాదను ‘నో’

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ”మనది సనాతన ధర్మం. హిందుత్వను ధర్మంగా మనం పరిగణించము. ధరమ్ కీ జై హో, అధర్మ్ కా నాష్ హో, ప్రాణియోం మే సద్భావన్ హో, విశ్వ కా కల్యాణ్ హో.. అనేవి సనాతన ధర్మ నినాదాలు. అయితే హిందుత్వ విషయంలో అలా కాదు. హిందుత్వ అంటే… తమతో ఏకీభవించని వారిని కర్రలతో కొట్టడం, ఇళ్లు కూల్చవేయడం’’ అని అన్నారు. ఇక బజరంగ్ దళ్‌ను బజరంగ్‌ బలి (హనుమంతుడు)తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోల్చడం బాధాకరమని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇది హనుమంతుడిని అవమానించడమేనని, ఇందుకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Congress vs Congress: గెహ్లాట్ ప్రభుత్వానికి 15 రోజుల అల్టిమేటం ఇచ్చి అవినీతి నిరోదక యాత్ర ముగించిన పైలట్

తాను చెప్పిన గూండాల గుంపు జబల్‌పూర్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని మే 4న ధ్వంసం చేసిందని ఆయన ఆరోపించారు. (కర్ణాటక మేనిఫెస్టో అనంతరం మధ్యప్రదేశ్ లో బజరంగ్ దళ్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశారు) రాజ్యాంగం, నిబంధనలు, చట్టాలను కాంగ్రెస్ గౌరవిస్తుందని, ఆ ప్రకారం నడుచుకుంటుందని చెప్పారు. కర్ణాటకలో బజ్‌రంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీపై ప్రశ్నించగా, విద్వేష ప్రకటనలు చేసేవారిపై మతప్రసక్తి లేకుండా కేసులు రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని, తాము దానికి కట్టుబడి ఉంటామని దిగ్విజయ్ వివరణ ఇచ్చారు.