Sachin Pilot: నేనూ మనిషినే, ఆ మాటలు బాధించాయి.. అశోక్ గెహ్లాట్ ‘ద్రోహి’ అనడంపై సచిన్ పైలట్

గెహ్లాట్, పైలట్ వివాదం ఈనాటిది కాదు. 2018లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటి నుంచి బహిరంగ చర్చలో ఉంది. ఈ విబేధాల కారణంగానే అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్.. సీఎం గెహ్లాట్ పైనే తిరుగుబాటుకు దిగారు. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రాజస్తాన్ పీసీసీ చీఫ్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా పైలట్‭పై విరుచుకు పడుతూనే ఉన్నారు గెహ్లాట్

Sachin Pilot: నేనూ మనిషినే, ఆ మాటలు బాధించాయి.. అశోక్ గెహ్లాట్ ‘ద్రోహి’ అనడంపై సచిన్ పైలట్

I did feel sad and hurt says pilot on gehlot remarks

Sachin Pilot: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనను ‘ద్రోహి’ (గద్దార్) అని వ్యాఖ్యానించడంపై ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ విచారం వ్యక్తం చేశారు. తాను రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ, తాను మనిషినేనని, కొన్ని మాటలు తనను బాధిస్తాయని, గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు సైతం తనను తీవ్రంగా బాధించాయని అన్నారు. కానీ, తాను గతంలోకి వెళ్లనని, పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ ముందుకు సాగిపోతానని అన్నారు. మంగళవారం ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్తాన్ రాజకీయం సహా.. సీఎం గెహ్లాట్‭తో ఉన్న విబేధాల గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు.

‘‘నిజమే, నేను రాజకీయాల్లో ఉన్నాను. అయితే నేను కూడా మనిషినే. అందరిలాగే కొన్ని నన్ను కూడా బాధపెడతాయి. ఆ మాటలు నన్ను చాలా బాధించాయి. చాలా ఇబ్బందికి గురి చేశాయి. అయితే నేను గతంలోకి వెళ్లదల్చుకోలేదు. నేను ప్రజా జీవితంలో ఉన్నాను. కాస్త హుందాగా వ్యవహరించడం తప్పనిసరి. నేనెప్పుడూ అదే కొనసాగిస్తూ వస్తున్నాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. వాటిని దాటుకొని వెళ్లాలి. నేను అదే అనుకుంటాను. అలాగే చేస్తున్నాను’’ అని పైలట్ అన్నారు.

Kiren Rijiju: న్యాయ వ్యవస్థ ఇక పూర్తిగా డిజిటల్.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

గెహ్లాట్, పైలట్ వివాదం ఈనాటిది కాదు. 2018లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటి నుంచి బహిరంగ చర్చలో ఉంది. ఈ విబేధాల కారణంగానే అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్.. సీఎం గెహ్లాట్ పైనే తిరుగుబాటుకు దిగారు. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రాజస్తాన్ పీసీసీ చీఫ్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా పైలట్‭పై విరుచుకు పడుతూనే ఉన్నారు గెహ్లాట్. ప్రతి సందర్భంలో గద్దార్ (ద్రోహి) అనే పదాన్ని మాత్రం ఉపయోగిస్తూనే ఉన్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్తాన్‭లోకి ప్రవేశానికి ముందు కూడా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 7-8 సార్లు పైలట్‭ను ద్రోహి అని సంబోధించారు. అనంతరం మర్నాడే ఇద్దరు నేతలు భారత్ జోడో యాత్ర కోసం చేతులు కలపాల్సి వచ్చింది. అయితే గెహ్లాట్ బహిరంగంగా ఇన్నిసార్లు పైలట్‭పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసినప్పటికీ.. పైలట్ మాత్రం ఒక్క బహిరంగ విమర్శనైనా చేయకపోవడం గమనార్హం.

MLA Raja Singh: రాజాసింగ్‌కు మళ్ళీ 2 షోకాజ్ నోటీసులు ఇచ్చిన పోలీసులు