Himanta Biswa Sarma: నాకే కనుక కోర్టు శిక్ష వేస్తే.. రాహుల్ కేసులో కాంగ్రెస్ తీరుపై సీఎం శర్మ ఫైర్

2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరువునష్టం దాఖలు చేశారు.

Himanta Biswa Sarma: నాకే కనుక కోర్టు శిక్ష వేస్తే.. రాహుల్ కేసులో కాంగ్రెస్ తీరుపై సీఎం శర్మ ఫైర్

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: మోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. కోర్టు తీర్పు ఆధారంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై వేటు పడింది. అయితే ఈ రెండు పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్లమెంట్ ఆవరణలో నల్ల జెండాలతో నిరసన చేపట్టాయి. అయితే కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఈ చర్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తననే కనుక కోర్టు దోషిగా ప్రకటించి జైలు శిక్ష వేస్తే తాను న్యాయపరంగా దాన్ని ఎదుర్కొంటానని, కానీ కోర్టులను అవమానించే విధంగా వ్యాఖ్యానించనని అన్నారు.

Girish Bapat: బీజేపీకి బిగ్ లాస్.. పార్టీ ఎంపీ గిరిష్ బాపట్ మరణం

బుధవారం ఆయన అస్సాం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ‘‘ఒకవేళ రేపు నాకు కోర్టు కనుక ఏదైనా కేసులో దోషిగా తేల్చి శిక్ష విధిస్తే.. బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల జెండాలు ధరించి నిరసన చేపట్టరు. వారికి కూడా అలా చేయమని నేను చెప్పను. నేను హైకోర్టును ఆశ్రయిస్తాను, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను. సెషన్స్ కోర్టును ఆశ్రయిస్తాను. కానీ న్యాయవ్యవస్థ మీద చెడు వ్యాఖ్యలు చేయను. కాంగ్రెస్ తీరు భారత ప్రజాస్వామ్యానికి మంచి సంకేతాల్ని ఇవ్వడం లేదు. 75 ఏళ్ల భారత చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. న్యాయవ్యవస్థను ఎప్పుడూ ఇంతలా అవమానించలేదు’’ అని అన్నారు.

Karnataka polls: ఇవే చివరి ఎన్నికలు.. భారీ ప్రకటన చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య

2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరువునష్టం దాఖలు చేశారు. ఈ కేసులోనే రాహుల్ దోషిగా తేలారు. కోర్టు తీర్పును అనుసరించి ప్రజాప్రాతినిధ్య చట్టం, 2015లోని సెక్షన్ 151(ఏ) ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ మీద అనర్హత వేటును స్పష్టం చేసింది.