అక్రమంగా మద్యం అమ్మితే ఆరు నెలలు జైలు, 2 లక్షల జరిమానా : సీఎం జగన్

రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 11:28 AM IST
అక్రమంగా మద్యం అమ్మితే ఆరు నెలలు జైలు, 2 లక్షల జరిమానా : సీఎం జగన్

రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నాన్ బెయిలబుల్ కేసులు పెడతామన్నారు. సోమవారం (డిసెంబర్ 16, 2019) ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో బార్ల సంఖ్య తగ్గింపుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కాపురాల్లో చిచ్చుపెడుతుందని, మావన సంబంధాలను ధ్వంసం చేస్తుందని అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పినట్లు తెలిపారు.

మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు. ఏపీలో బెల్టు షాపులు తగ్గలేదన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై స్పందించిన సీఎం జగన్.. నోరు తెరిస్తే అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట సభల్లో అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారని.. అబద్ధాలు మాట్లాడే వ్యక్తికి అవకాశాలు ఇవ్వొద్దని సూచించారు. ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తామని చెప్పారు. మద్యం సేల్స్ పెంచాలని గతంలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు టార్గెట్లు ఇచ్చేవారని సీఎం జగన్ తెలిపారు.

చంద్రబాబు హయాంలో 4380 మద్యం షాపులు ఉన్నాయని…ఇప్పుడు మద్యం షాపుల సంఖ్య 3456 కు తగ్గిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు లేకుండా చేశామని తెలిపారు. డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. మెడికల్ ఆండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కు ఇప్పటికే ఆదేశాలిచ్చామని తెలిపారు.