హిందూపురంలో బాలకృష్ణకు అవమానం

హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం జరిగింది. తనకు ఎస్కార్ట్ కల్పించాలని సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు.

  • Published By: veegamteam ,Published On : October 25, 2019 / 11:03 AM IST
హిందూపురంలో బాలకృష్ణకు అవమానం

హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం జరిగింది. తనకు ఎస్కార్ట్ కల్పించాలని సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు.

హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం జరిగింది. తనకు ఎస్కార్ట్ కల్పించాలని సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. బెంగళూరు వెళ్లాలని బాలకృష్ణ మూడు పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఎస్కార్ట్ కల్పించలేదు. దీంతో చేసేది ఏమీలేక బాలకృష్ణ ఒక్కరే తన వాహనంలో బెంగళూరు బయలుదేరారు. మరోవైపు ఎమ్మెల్యేకే రక్షణ కల్పించలేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రోటో కాల్ పాటించడం లేదని ఆరోపిస్తున్నారు.

ఉదయం అధికారులతో బాలకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత కావాలని మూడు పోలీస్ స్టేషన్లకు సమచారం ఇచ్చినా ఉదయం నుంచి పర్యటన ముగించుకుని 2.30 గంటలకు బయలుదేరారు. మరో పర్యటనకు సంబంధించి భద్రత కల్పించాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో అరగంట సేపు వెయిట్ చేసి తన వాహనంలో బాలకృష్ణ బెంగళూరుకు బయలుదేర్దారు.

భద్రత కల్పించకపోవడం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారంటే టీడీపీ హయాంలో డీఎస్ పీ, ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ ఐలతో సహా ప్రోటోకాల్ పాంటించేవారని తెలిపారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రోటో కాల్ పాటించాల్సిందే. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రోటో కాల్ పాటించకుండా పోలీసులు అవమాన పర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులతో సమావేశం కావచ్చు..అలాగే బెంగళూరు వెళ్తుండగా మధ్యలో ఏమైన జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. భద్రత లేకుండా బాలకృష్ణ ఒక్కరినే పంపిచారని.. ఇది హేయమైన చర్యగా టీడీపీ నేతలు అభివర్ణించారు. నిన్న కూడా ప్రోటోకాల్ పాటించి వుంటే బాలకృష్ణను అడ్డుకుని రోడ్డుపై అర్ధగంట నిలిబెట్టే పరిస్థితి వచ్చేది కాదన్నారు. బాలకృష్ణ ఎమ్మేల్యేనే కాదు ఒక సెలబ్రిటీ కూడా అలాంటప్పుడు.. పోలీసులు భద్రత కల్పించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.