దేశానికి ద్రోహం చెయ్యలేదు : సస్పెన్షన్ పై ఐపీఎస్ వెంకటేశ్వరరావు

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అక్రమాలు చేశారని చెబుతూ ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 05:16 AM IST
దేశానికి ద్రోహం చెయ్యలేదు : సస్పెన్షన్ పై ఐపీఎస్ వెంకటేశ్వరరావు

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అక్రమాలు చేశారని చెబుతూ ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అక్రమాలు చేశారని చెబుతూ ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ సంచలనంగా మారింది. ఏపీ రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. సస్పెన్షన్ పై వెంకటేశ్వరరావు స్పందించారు. తన హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. తాను ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ లేదని వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలను వెంకటేశ్వరరావు ఖండించారు. నిబంధనలకు అనుగుణంగానే తాను పని చేశానని చెప్పారు.

ప్రభుత్వం చర్యలతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని వెంకటేశ్వరరావు అన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్టపరంగా ముందుకెళ్తానని వెంకటేశ్వరరావు చెప్పారు.

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో ఏబీపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు డీజీపీ నుంచి ఫిబ్రవరి 7న అందిన నివేదిక ఆధారంగా వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. సస్పెన్షన్‌ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును ప్రజా ప్రయోజనాల రీత్యా సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వివరించింది. 

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ నిబంధనల నియమం కింద సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్‌ చేసినట్లు జీవో నంబర్‌ 18లో పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘా పరికరాల కొనుగోలు చేశారని, ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడు చేతన్‌ సాయికృష్ణ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించాడని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని ప్రభుత్వం చెబుతోంది.
 
విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడంతో జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపించింది. నాణ్యత లేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా దేశ, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్, విధానాలను బహిర్గతం చేశారని ఆరోపించింది. ఇది రాష్ట్రం, దేశ ద్రోహమని తన ఉత్తర్వుల్లో చెప్పింది. ఏబీ వెంకటేశ్వరరావుతో దేశానికి ముప్పు ఉందని ప్రభుత్వం చెప్పింది.

* సస్పెన్షన్ పై స్పందించిన ఏపీ వెంకటేశ్వరరావు
* నా హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు
* ఈ చర్యలతో నాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు
* మిత్రులు, బంధువులు నా సస్పెన్షన్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు

* సస్పెన్షన్ పై చట్టపరంగా ముందుకెళ్తా
* తదుపరి ఏమిటన్నది క్రమంగా తెలుస్తుంది
* అక్రమాల కారణంగా నాపై చర్య తీసుకున్నారన్నది అవాస్తవం