UP: యూపీలో ముస్లిం సమాజం ఎస్పీ నుంచి బీఎస్పీ వైపుకు వెళ్తోందా?

కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆమె వెంటే ముస్లిం సమాజం ఉంటుందని సూటిగానే చెప్పారు. తొందరలోనే ఈయన కూడా ఎస్పీని వదిలేసి ఏనుగెక్కుతారనే ప్రచారం జోరుగానే సాగుతోంది

UP: యూపీలో ముస్లిం సమాజం ఎస్పీ నుంచి బీఎస్పీ వైపుకు వెళ్తోందా?

Is the Muslim community moving from SP to BSP in UP?

UP: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‭వాది పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ముస్లింలు. చాలా కాలం వరకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న ముస్లింలు, పిమ్మట బీఎస్పీ వైపుకు కొంత, ఎస్పీ వైపుకు కొంత మళ్లారు. అయితే కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం వల్ల కాబోలు, ముస్లిం ఓటర్లంతా ఎస్పీ వైపుకు వచ్చేశారు. పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తేటతెల్లమైంది. ఎస్పీ సాధించిన 30+ శాతం ఓటు బ్యాంకులో 15 శాతానికి పైగా ఓట్లు కేవలం ముస్లింలవే అంటే నమ్మశక్యం కాదు. ఏఐఎంఐఎం వంటి ముస్లిం ప్రాతినిధ్య పార్టీలను కాదని ఎస్పీకి మూకుమ్మడిగా ఓట్లు కుమ్మరించారు.

Karnataka: ఎన్నికలకు బీజేపీ పక్కా ప్లాన్.. నాలుగు దిక్కుల నుంచి రథయాత్రలు చేస్తారట

ఓటర్లే కాదు, లీడర్లు కూడా ఎస్పీకి గట్టి మద్దతునిచ్చారు. బహుశా.. ముస్లిం ఓటర్లు ఏక పక్షంగా ఎస్పీకి మద్దతుగా ఉండడానికి ఎస్పీ వైపు బలమైన ముస్లిం నేతలు ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. కారణాలు ఏవైతేనేం, బీజేపీ హిందుత్వ రాజకీయాల్ని ఢీకొట్టడానికి యూపీలో ఓబీసీ ఓట్ల కంటే దళిత, ముస్లిం ఓట్లే కీలకంగా మారాయి. అయితే దళిత ఓట్లు బీఎస్పీ వైపు ఉండగా, ముస్లిం ఓటర్లు మాత్రం ఎస్పీకి మద్దతు ఇచ్చారు.

UP: మాయావతి నాయకత్వం కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమాజ్‭వాదీ పార్టీ ఎంపీ

కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ముస్లిం ఓటర్లు ఎస్పీ నుంచి దూరంగా వెళ్లనున్నారా అనే అనుమానం కలుగుతోంది. కారణం, ఎస్పీ నుంచి ముస్లిం లీడర్లు బయటికి వెళ్తుండడం. అంతే కాకుండా ఇప్పటికీ పార్టీలో ఉన్న ముస్లింలు అసంతృప్తితో ఉండడం. ములాయం సింగ్ యాదవ్ తర్వాత పార్టీలో అంత పెద్ద నాయకుడిగా భావించే అజాం ఖాన్ పట్ల అఖిలేష్ వైఖరి సరిగా లేదని, బీజేపీ ఆయనను జైలుకు పంపితే అఖిలేష్ సరైన చొరవ చూపలేదనే విమర్శ బలంగానే ఉంది. వీటికి తగ్గట్టు అజాం ఖాన్ సైతం.. జైలులో ఉండగా ఎస్పీ నేతల్ని కలవకపోవడం, బయటికి వచ్చాక కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది.

Assembly Election: ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాల్లో ఏ పార్టీ బలమెంతంటే?

కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆమె వెంటే ముస్లిం సమాజం ఉంటుందని సూటిగానే చెప్పారు. తొందరలోనే ఈయన కూడా ఎస్పీని వదిలేసి ఏనుగెక్కుతారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. వీటికి తోడు ముస్లిం సమాజం పట్ల మాయావతి సానుకూలంగా స్పందిస్తుండడం కూడా ముస్లిం ఓటర్లపై ప్రభావం పడుతుందని అంటున్నారు. అజాం ఖాన్‭ను సైతం తమ పార్టీలోకి లాగేందుకు మాయావతి ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారట. వీరంతా నిజంగానే బీఎస్పీ వైపుకు వెళ్తే, యూపీలో మెజారిటీ ముస్లిం ఓట్లు మాయావతి ఖాతాలో పడ్డట్టే.