ఐటీ గ్రిడ్  కేసు : ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ ఎంపీలు

  • Published By: chvmurthy ,Published On : March 9, 2019 / 10:05 AM IST
ఐటీ గ్రిడ్  కేసు : ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ ఎంపీలు

అమరావతి :  ఐటీ గ్రిడ్‌ డేటా చౌర్యం కేసులో వైసీపి స్పీడ్ పెంచింది. పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీలు సీనియర్ నేతలు సోమవారం  మార్చి 11న ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుక గాను సోమవారం సాయంత్రం గం. 4.30 నిమిషాలకు  చీఫ్ ఎలక్షన్  కమీషన్ తో భేటి కి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఐటి గ్రిడ్ డేటా చోరి, ఓట్ల తొలగింపు పై యాక్షన్ తీసుకోవాలంటూ వారు ఈసీ కి ఫిర్యాదు చేయనున్నారు. తొలగించిన ఓట్ల జాబితాను 24 పెన్ డ్రైవ్ లలో వైసీపి నేతలు  సిద్దం చేసుకున్నారు.  పెన్ డ్రైవ్ లు ఈసి కి ఇచ్చి వాటిని ఎలా తొలగించారన్న దానిపై విచారణ చేపట్టాలని వైసీపి కోరనున్నారు. 

మరో వైపు ఐటీ గ్రిడ్ కంపెనీలో కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నామని  తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇంచార్జ్ స్టీఫెన్ రవీంద్ర  చెప్పారు. శనివారం ఆయన ఐటీ గ్రిడ్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఇంతకుముందు స్వాధీనం చేసుకున్న డేటాను  డీ కోడింగ్ఎ కోసం ఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామని,  అమెజాన్‌ నుంచి ఐటీగ్రిడ్స్‌కు చెందిన డేటా రావాల్సి ఉందని ఆయన తెలిపారు.