వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంది : పవన్ కల్యాణ్

రైతు కన్నీరు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. అధికారం కోసం కాదు.. ప్రజల కోసం అర్రులు చాచే పార్టీ జనసేన అని చెప్పారు సేనాని. రైతులకు అండగా

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 03:48 AM IST
వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంది : పవన్ కల్యాణ్

రైతు కన్నీరు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. అధికారం కోసం కాదు.. ప్రజల కోసం అర్రులు చాచే పార్టీ జనసేన అని చెప్పారు సేనాని. రైతులకు అండగా

రైతు కన్నీరు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. అధికారం కోసం కాదు.. ప్రజల కోసం అర్రులు చాచే పార్టీ జనసేన అని చెప్పారు సేనాని. రైతులకు అండగా ఉంటామని చెప్పి.. నాయకులు  వారిని మోసం చేశారని కాకినాడ రైతు సౌభాగ్య దీక్షలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కూల్చివేతలతో మొదలుపెట్టిన వైసీపీ ప్రభుత్వం కూడా.. ఏదో ఓ రోజు కూలిపోతుందన్నారు పవన్ కల్యాణ్.

రైతు సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. డిసెంబర్ 12వ తేదీ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. జనసేనానికి.. తూర్పుగోదావరి జిల్లా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు. వాటిని పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని చెప్పారు పవన్. తమ కోసం ఒక రోజు దీక్ష చేసిన సేనానికి.. రైతులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నాయకులు బాగానే ఉన్నారు.. రైతులు కన్నీరు పెడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల్లోనే.. వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు.. జనసేన ఎప్పుడూ ముందుంటుందన్నారు పవన్ కల్యాణ్.

తనకు సూట్ కేస్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవన్నారు పవన్ కల్యాణ్. అందుకే.. తనకు వాటి కష్టాలు తెలియవని చెప్పారు. తనకు కేవలం రైతు సమస్యలు, కష్టాలు మాత్రమే తెలుసన్నారు. రైతుల కన్నీరు తుడిచేవరకు ఎన్ని తిట్లైనా భరిస్తామన్నారు పవన్ కల్యాణ్. కానీ.. తమదైన రోజు వచ్చిన రోజు.. 150 మంది ఎమ్మెల్యే భస్మిపటలమైపోతారని హెచ్చరించారు. రైతుల గురించి చర్చించకుండా.. అసెంబ్లీ సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.

రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని జనసేనాని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడేలా కార్యాచరణ ఉండాలని.. పవన్ జనసైనికులకు పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై  మరింత అధ్యయనం చేయడానికి గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు పవన్ కల్యాణ్.