జనసేన నాలుగో జాబితా : విశాఖ ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ

జనసేన నాలుగో జాబితా : విశాఖ ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ

జనసేన నాలుగో జాబితా : విశాఖ ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ

మూడో దఫాలుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విడుదల చేసిన జనసేన నాలుగో జాబితా కూడా విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకూ 98 సీట్లను ప్రకటించినట్లయింది. ఇక మిగిలిన 40 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన రెండ్రోజుల క్రితం జేడీ జనసేన పార్టీలో చేరడం పార్టీకి కీలకంగా మారింది. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు జేడీ లక్ష్మీ నారాయణ పేరు ఖరారైంది. 
Read Also : ఏపీలో ప్రలోభాలు : రూ.16.53 కోట్లు, రూ.4.22 కోట్ల బంగారం సీజ్ – ద్వివేదీ

ట్విట్టర్ వేదికగా తమ పార్టీ విడుదల చేసిన నాలుగో జాబితాను జనసేన పార్టీ అధికారికంగా విడుదల చేసింది. ఈ నాలుగో జాబితాలో శాసన అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి. 

విశాఖపట్టణం ఉత్తరం: పసుపులేటి ఉషా కిరణ్
విశాఖపట్టణం దక్షిణం: శ్రీ గంపల గిరధర్
విశాఖపట్టణం తూర్పు: శ్రీ కోన తాతారావు
భీమిలి: శ్రీ పంచకర్ల సందీప్
అమలాపురం: శ్రీ శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం: శ్రీ తుమ్మల రామస్వామి(బాబు)
పోలవరం: శ్రీ చిర్రి బాలరాజు
అనంతపురం: శ్రీ టి.సి వరుణ్

లక్ష్మినారాయణ పాటు బంధువైన రాజగోపాల్‌ను జనసేన పార్టీలోని ఓ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చినట్లు పార్టీ ప్రకటించింది. ముందుగా అనంతపురం శాసన సభ స్థానం నుంచి పోటీచేయాలని రాజగోపాల్ కు సూచించిన పార్టీ .. ఎట్టకేలకు పార్టీలోకి కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించింది. 

Read Also : సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి : దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి

×