పవన్ కళ్యాణ్‌ను లెక్క చేయని జనసైనికులు, ఆ పార్టీతో పొత్తులు

మాతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో నలుగురైదుగురు కూర్చొని పొత్తు పెట్టేసుకుంటే పనైపోతుందా? సరిగ్గా ఇలానే ఆలోచించినట్టున్నారు జనసైనికులు. స్థానిక ఎన్నికల్లో

  • Published By: veegamteam ,Published On : March 19, 2020 / 07:47 AM IST
పవన్ కళ్యాణ్‌ను లెక్క చేయని జనసైనికులు, ఆ పార్టీతో పొత్తులు

మాతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో నలుగురైదుగురు కూర్చొని పొత్తు పెట్టేసుకుంటే పనైపోతుందా? సరిగ్గా ఇలానే ఆలోచించినట్టున్నారు జనసైనికులు. స్థానిక ఎన్నికల్లో

మాతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో నలుగురైదుగురు కూర్చొని పొత్తు పెట్టేసుకుంటే పనైపోతుందా? సరిగ్గా ఇలానే ఆలోచించినట్టున్నారు జనసైనికులు. స్థానిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు చాలా జిల్లాల్లో జనసైనికులు సిద్ధపడడం లేదు. రాష్ట్రంలో ఏమైనా చేసుకోండి.. లోకల్‌గా మాత్రం తాము చేసుకున్నవే పొత్తులు అంటూ టీడీపీతో కలిసి ముందుకెళ్లేందుకు డిసైడ్‌ అయిపోయారు. 

రాష్ట్రస్థాయి పొత్తులు క్షేత్రస్థాయిలో వర్కవుట్‌ కావడం లేదా?:
ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటు అనేక జిల్లాల్లో అధికార వైసీపీ నేతలు రెచ్చిపోవడం చూస్తున్నదే. ప్రత్యర్థి పార్టీల నేతలపై బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడటం, నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, ఉపసంహరణ కోసం బెదిరించడం వంటి సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో కుదిరిన పొత్తుల వ్యవహారం క్షేత్రస్థాయిలో పొసగడం లేదంట. ముఖ్యంగా బీజేపీ, జనసేనల మధ్య రాష్ట్ర స్థాయిలో పొత్తులున్నాయి. కానీ, స్థానికంగా వచ్చేసరికి అలాంటి అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. 

తూర్పు గోదావరిలో టీడీపీతో చేతులు కలిపిన జనసేత నేతలు:
కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు దాదాపు ఫెయిల్‌ అయిపోయిందంట. జనసేన నేతలు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీతో చేతులు కలిపారంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఇవే పరిస్థితులున్నాయట. విజయవాడ నగరపాలక సంస్థలో 40 వార్డులలో జనసేన, 24 వార్డులలో బీజేపీ పోటీచేసేలా తొలుత సీట్ల సర్దుబాటు జరిగింది. కానీ ఆ అంగీకారం అమలులోకి కాలేదు. ఎవరికి బలం ఉన్నచోట వారు వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుని నామినేషన్లు దాఖలు చేసేశారని అంటున్నారు.   

గుంటూరు, తూ.గో, ప.గో, కృష్ణా జిల్లాల్లో టీడీపీ, జనసేన పొత్తులు:
గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ కొత్త పొత్తులు పొడిచాయని పార్టీలు అంటున్నాయి. ఆయా చోట్ల జనసేన, టీడీపీ నేతలు ఎంపీటీసీని ఒకరు, సర్పంచ్ పదవిని మరొకరు పంచుకునేలా అంగీకారానికి వచ్చి బరిలోకి దిగారట. మరికొన్ని ప్రాంతాల్లో మండలస్థాయిలో కుదిరిన పొత్తులు ఆసక్తికరంగా ఉన్నాయని చెబుతున్నారు. మండల అధ్యక్ష పదవిని చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకునేలా అనేక మండలాల్లో ఒప్పందాలు కుదిరిపోయాయట. ఇలా గ్రామ- మండల స్థాయిలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నేతలు పొత్తులు కుదుర్చుకున్నాయని చెబుతున్నారు. ఆ రెండు పార్టీల అధినేతలకు ఈ విషయం తెలిసినా సైలెంట్‌గా ఉంటున్నారట. 

గుంటూరులో కనిపించని టీడీపీ, సీపీఐ పొత్తు ప్రభావం:
రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల టీడీపీ, సీపీఐల మధ్య కుదిరిన పొత్తులు కూడా క్షేత్రస్థాయిలో అంత ప్రభావం చూపించ లేదంటున్నారు. గుంటూరు నగరంలో సీపీఐ, టీడీపీ నేతల మధ్య కనీస సంబంధాలు కూడా కనిపించడం లేదంట. విజయవాడలో మాత్రం సీపీఐ, టీడీపీ పొత్తు కుదరింది. ఎంపీ కేశినేని నాని ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి పొత్తును సాఫీగా ముందుకు నడిపించారట. ఇక కాంగ్రెస్, సీపీఎంలు నేరుగా పొత్తు పెట్టుకోకుండా, సీట్ల సర్దుబాటుపై అవగాహనతో ముందుకెళ్తున్నాయి. ఒకరు పోటీ చేసే ప్రాంతంలో మరొకరు పోటీ చేయకుండా.. మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించాయి. 

రాష్ట్ర స్థాయి పొత్తులతో సంబంధం లేదంటన్న లోకల్‌ లీడర్స్‌:
ఏ పార్టీకి చెందిన నేతలైనా స్థానికంగా తమ గెలుపు ముఖ్యమనీ, రాష్ట్రస్థాయిలో కుదిరే పొత్తులతో తమకు సంబంధం లేదనీ తేల్చి చెబుతున్నారట. కానీ గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీ మధ్య కుదిరిన స్థానిక పొత్తులు భవిష్యత్ రాజకీయాలను ఎలా మారుస్తాయో అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్థానికంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య కుదిరిన పొత్తులపై వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. మరి ఈ పొత్తులు ఎవరికి ప్లస్‌ అవుతాయో చూడాల్సిందే.
 

See Also | పెట్రోల్ నిల్వలు చేసుకోవడానికి భారత్‌కు ఇదే సరైన సమయం