పవన్‌ దీక్షకు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక దూరం

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ దీక్షకు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను హాజరుకాలేక పోతున్నట్టు ఆయన పవన్‌కు వివరణ ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 02:45 AM IST
పవన్‌ దీక్షకు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక దూరం

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ దీక్షకు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను హాజరుకాలేక పోతున్నట్టు ఆయన పవన్‌కు వివరణ ఇచ్చారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ దీక్షకు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను హాజరుకాలేక పోతున్నట్టు ఆయన పవన్‌కు వివరణ ఇచ్చారు. దీంతో ఆయన నేటి పవన్‌ దీక్షకు హాజరు కావడం లేదు. అయితే పార్టీ నిర్మాణం జరగడం లేదని, ఈ విషయంలో పవన్‌కు తనకు మధ్య విభేదాలున్నాయని ఆయన బాహాటంగా ప్రకటించారు. 

అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం పవన్‌ కళ్యాణ్ మన నుడి-మన నది కార్యక్రమం చేపడుతుండగా… దానికి వ్యతిరేకంగా రాపాక వ్యవహరించడంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కావాలనే ఆయన దీక్షకు దూరంగా ఉంటున్నారా అన్న అనుమానాలు 
వ్యక్తమవుతున్నాయి. 

కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే రైతు సౌభాగ్య దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం(డిసెంబర్ 12,2019) జెఎన్ టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో భారీ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ దీక్షకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో దీక్షా శిబరం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రతీ ఒక్కరూ పవన్‌ను కలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పవన్‌ కల్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. రైతు భరోసా పథకంలో అగ్రవర్ణ రైతులకు జరుగుతున్న అన్యాయం.. గిట్టుబాటు ధర కల్పించకపోవడం, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలపై ఈ దీక్ష చేపడుతున్నారు. దీక్షలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్‌తో పాటు కీలక నాయకులు ఇప్పటికే కాకినాడ చేరుకున్నారు. పవన్ బస చేసిన జిఆర్టీ గ్రాండ్ హోటల్ నుంచి దీక్షా శిబిరం వరకు రహదారిని జనసేన జెండాలతో ముస్తాబు చేశారు.