శివ..శివ..చలి పారిపోయిందా : జనవరిలోనే ఎండలు

  • Published By: madhu ,Published On : January 29, 2020 / 03:18 AM IST
శివ..శివ..చలి పారిపోయిందా : జనవరిలోనే ఎండలు

ముందే ఎండకాలం వచ్చేసిందా ? అని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే జనవరిలో మాసంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో పగలు వేళ ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. శివరాత్రి జాగారంతో శివ..శివ అంటూ వెళ్లిపోవాల్సిన..చలి ముందే పారిపోయినట్లుంది. రాష్ట్రంలో శీతాకాలం కేవలం రెండు రోజులే తీవ్రత చూపించింది. గత డిసెంబర్ 28, 29వ తేదీల్లో ఈ కాలానినికి చలి రోజులు.

2018లో 13 రోజుల పాటు శీతలగాలుల తీవ్రత నమైందని, మారుతున్న వాతావరణంతో టెంపరేచర్స్ పెరుగుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. సాధారణంగా హైదరాబాద్‌లో 10-11 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఈ శీతాకాలంలో మాత్రం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలే. రాత్రిపూట వేడి తగ్గడం లేదు. 

తెలంగాణ రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు వేసవి ప్రారంభ రోజుల స్థాయికి చేరుకుంటున్నాయి. ఖమ్మంలో పదేళ్ల స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2016, జనవరి 30వ తేదీన 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కానీ…2020, జనవరి 28వ తేదీ మంగళవారం మాత్రం..33.8 డిగ్రీలు నమోదు కావడం విశేషం. అలాగే మహబూబ్ నగర్‌లో 34.9, హైదరాబాద్, హన్మకొండలో 33 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

రామగుండంలో సాధారణం కన్నా..5.2 డిగ్రీలు, భద్రాచలంలో 4.7 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కపోత, ఎండలతో అల్లాడుతున్నారు. ఎండ వేడిమి నుంచి రక్షించుకొనేందుకు అప్పుడే శీతల పానీయాల వైపు చూస్తున్నారు. 

Read More : కరోనా వైరస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు