ముఖ్యమంత్రిని చేస్తే : రుణాలన్నీ మాఫీ చేస్తా

విజయవాడ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వరాల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే బ్యాంకుల్లో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 09:44 AM IST
ముఖ్యమంత్రిని చేస్తే : రుణాలన్నీ మాఫీ చేస్తా

విజయవాడ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వరాల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే బ్యాంకుల్లో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని

విజయవాడ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వరాల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే బ్యాంకుల్లో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం(మార్చి 24,2019) మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. తాము గెలిస్తే విజయవాడను హైదరాబాద్‌ కన్నా మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తమను గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు. అంతేకాదు ఏడాదిలో లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రకటించారు.

తమ పార్టీని చూస్తే టీడీపీ, వైసీపీకి నిద్రపట్టడం లేదు కేఏ పాల్ అన్నారు. అవినీతిపరులను వదిలేసి మా గదులు తనిఖీ చేస్తే ఏం దొరుకుతుందని ప్రశ్నించారు. నరసాపురంలో ఎంపీగా, భీమవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని.. తనకే ఓటు వేసి గెలిపించాలని పాల్ విజ్ఞప్తి చేశారు.

కేఏ పాల్ బసచేసిన విజయవాడలోని హోటల్ లో ఆదివారం ఉదయం పోలీసులు సోదాలు జరిపారు. హోటల్ లోని 301 నంబర్ రూమ్ లో పాల్ బసచేశారు. బీ-ఫారాల జారీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని పాల్ పై అభియోగాలు వచ్చాయి. దీనిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తన సహాయకుల నిమిత్తం అదే హోటల్ లో పాల్ బుక్ చేసుకున్న రూముల్లో కూడా సోదాలు నిర్వహించారు. పార్టీ టికెట్ ఇచ్చేందుకు కేఏ పాల్ డబ్బు వసూలు చేశారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొందరు బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్ కు స్వయంగా ఫిర్యాదు చేయడంతో వారు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.