Kamal Haasan: పార్లమెంట్ నూతన భవన వివాదంపై విపక్షాలకు కమల్ హాసన్ ఆసక్తికర సలహా

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం దేశానికి గర్వకారణమని తెలిపారు. భారత దేశ నూతన గృహంలో కుటుంబ సభ్యులంతా నివసించాలన్నారు. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని తాను నమ్ముతానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.

Kamal Haasan: పార్లమెంట్ నూతన భవన వివాదంపై విపక్షాలకు కమల్ హాసన్ ఆసక్తికర సలహా

MNM chief Kamal Haasan

Parliament Inauguration Controversy: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలకు మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఓ కీలక సలహా ఇచ్చారు. రాజకీయ విభేదాలకు ఒక రోజు విరామం ప్రకటించాలని, ఈ కార్యక్రమాలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించి, జాతీయ ఐకమత్య సంబరంగా దీనిని మార్చాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలను ఆయన కోరారు. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తుండడాన్ని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు బాయ్‭కాట్ చేశాయి. ఈ సందర్భంలో కమల్ పై విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

TDP Mahanadu 2023: ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం.. బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

శనివారం ఆయన పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం దేశానికి గర్వకారణమని తెలిపారు. భారత దేశ నూతన గృహంలో కుటుంబ సభ్యులంతా నివసించాలన్నారు. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని తాను నమ్ముతానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. దేశ ఐకమత్యాన్ని చాటే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మార్చాలని కోరారు. అందుకే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నానని చెప్పారు.

Narendra Modi: తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ఏయే ముఖ్య పథకాలు ప్రవేశపెట్టారో తెలుసా?

అయితే ఇది రాజకీయంగా విభజనకు దారితీసిందని పేర్కొన్నారు. విపక్షాలకు సలహా ఇస్తూనే మోదీ ప్రభుత్వంపై సైతం విమర్శలు గుప్పించారు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదో దేశానికి చెప్పాలని కమల్ డిమాండ్ చేశారు. దేశానికి అధిపతి అయిన రాష్ట్రపతి ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామి కాకపోవడానికి ఎటువంటి కారణం తనకు కనిపించడం లేదని ఆయన అన్నారు. ఇక ఇదే సమయంలో ఈ కార్యక్రమం పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే బహిరంగ వేదికలపై కానీ, నూతన పార్లమెంటులో కానీ లేవనెత్తవచ్చునని విపక్షాలకు కమల్ సూచించారు. మనల్ని విభజించేవాటి కన్నా కలిపి ఉంచేవి ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోవాలని కోరారు. యావత్తు దేశం ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తోందన్నారు. ప్రపంచం దృష్టి మనపై ఉందన్నారు.