Karnataka: గురువారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం.. ఇంతకీ కొత్త సీఎం ఎవరో తెలుసా?

224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది

Karnataka: గురువారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం.. ఇంతకీ కొత్త సీఎం ఎవరో తెలుసా?

New CM: కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. గురువారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. ఇక కాంగ్రెస్ భావజాలానికి సరిపోయే ప్రాంతీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారట. అయితే ఇక్కడో కీలక విషయం ఏంటంటే.. గురువారం ప్రమాణం చేయబోయే ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని మాత్రం పార్టీ వెల్లడించలేదు.

Karnataka Polls: చిత్తు చిత్తుగా ఓడిపోయిన 11 మంది బీజేపీ మంత్రులు.. వారి పేర్లేంటో తెలుసా?

ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టా నుంచి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశమై చర్చించారు. అయితే ఈ చర్చలో ముఖ్యమంత్రి అభ్యర్థి నిర్ణయాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికే వదిలేస్తూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఈరోజే తుది నిర్ణయం తీసుకోలేమని, అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని వాటిని హైకమాండ్ పరిశీలను పంపి, అక్కడి నుంచి అభ్యర్థి ఖరారు అవుతారని సమాచారం.

Karnataka Polls: బీజేపీ, జేడీఎస్ ఎక్కడ బలంగా ఉన్నాయో అక్కడే గట్టిగా కొట్టిన కాంగ్రెస్

ఇక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాగానే కర్ణాటక మంత్రివర్గం కూర్పు ఒకటి రెండు రోజుల్లో రూపుదిద్దుకుంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇక షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీకి రిజర్వ్ చేసిన ఒక్క సీటులో కూడా బీజేపీ గెలవలేదు. కర్ణాటకలో 51 రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిలో 36 షెడ్యూల్డ్ కులాల (SC) అభ్యర్థులకు, 15 స్థానాలకు షెడ్యూల్డ్ కులాల (ST) అభ్యర్థులకు కేటాయించారు.