Revanth Reddy : నిన్న హిమాచల్, నేడు కర్నాటక, రేపు తెలంగాణ, ఆ తర్వాత ఢిల్లీ- రేవంత్ రెడ్డి ధీమా

Revanth Reddy : కేసీఆర్ ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు చిత్తు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికలు రాబోయే తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని, కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

Revanth Reddy : నిన్న హిమాచల్, నేడు కర్నాటక, రేపు తెలంగాణ, ఆ తర్వాత ఢిల్లీ- రేవంత్ రెడ్డి ధీమా

Revanth Reddy

Revanth Reddy On Karnataka Election Results : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం నింపింది. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఇంకాస్త ఎక్కువ నూతనోత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. కర్నాటక ఫలితాలతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు, కర్ణాటక ఫలితాలే ఇటు తెలంగాణలోనూ అటు ఢిల్లీలోనూ రిపీట్ అవుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసం అన్నారాయన. కాంగ్రెస్ పార్టీ.. మతాన్ని రాజకీయాలకు వాడుకోదన్నారు. మత రాజకీయలతో కర్ణాటకలో అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుందన్నారు. అయితే, బీజేపీ మత రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని రేవంత్ రెడ్డి చెప్పారు.

Also Read..Minister KTR : కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా .. తెలంగాణలో అవి పనిచేయవ్ ..

తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అస్థిర రాజకీయాలతో సుస్థిర రాజకీయాలు చేయాలనుకున్నారు అని కేసీఆర్ పై విమర్శలు చేశారు. హంగ్ ఏర్పరచి కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా చేయాలనుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు చిత్తు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికలు రాబోయే తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని, కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. నిన్న హిమాచల్ ప్రదేశ్, నేడు కర్ణాటక, రేపు తెలంగాణ అని అన్నారు. భవిష్యత్ లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ పైనా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గెలుపును కేటీఆర్ ప్రజా తీర్పుగా అభివర్ణించలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేటీఆర్ కు ఇష్టం లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read..Rahul Gandhi : కర్ణాటకలో ప్రేమ దుకాణం తెరుచుకుంది.. ప్రతి రాష్ట్రంలో ఇదే రిపీట్ అవుతుంది

కర్నాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224. కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలుపొందింది. హస్తం పార్టీకి స్పష్టమైన మెజారీ దక్కింది. ఇక, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 113. కాగా, మేజిక్ ఫిగర్ కు 23 స్థానాలు ఎక్కువే గెలిచిన హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాల్చుతూ, ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.

అధికార బీజేపీకి కన్నట ఓటర్లు షాక్ ఇచ్చారు. బీజేపీ 64 సీట్లకే పరిమితమైంది. జనతాదళ్ (ఎస్) 20 స్థానాల్లో నెగ్గగా, ఇతరులు 4 స్థానాలు కైవసం చేసుకున్నారు.