Karnataka: దున్నపోతుల్ని చంపుతున్నాంగా ఆవుల్ని చంపితే ఏమైంది? కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటకలోని క్రితం బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కఠినమైన కర్ణాటక గోహత్య నిరోధకం, పశువుల సంరక్షణ (సవరణ) 2020 బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లును 2021లో రాష్ట్ర శాసనసభలో అప్పటి అధికార బీజేపీ ఆమోదించింది. అయితే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీజేపీ అప్పట్లో చేసిన చట్టం అమలుపై చర్చ జరుగుతోంది

Karnataka: దున్నపోతుల్ని చంపుతున్నాంగా ఆవుల్ని చంపితే ఏమైంది? కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

K Venkatesh: దేశంలో గోవధ గురించి పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో కర్ణాటక పశుసంవర్ధక మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీసేలానే కనిపిస్తున్నాయి. గేదెలను, దున్నపోతులను వధిస్తున్నప్పుడు ఆవులను వధిస్తే వచ్చిన ఇబ్బందేంటంటూ ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం చేసుకునే ప్రజలు.. ముసలివైపోయిన ఆవులను వధకు పంపలేక, అవి చనిపోయినప్పుడు అదనపు ఖర్చు, శ్రమ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అవసరమైతే రైతుల కోసం ఈ విషయమై చట్టం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

United Nations: పాకిస్థాన్ సహా ఆహార కొరతతో అల్లాడిపోనున్న దేశాలు ఇవే..

కర్ణాటకలోని క్రితం బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కఠినమైన కర్ణాటక గోహత్య నిరోధకం, పశువుల సంరక్షణ (సవరణ) 2020 బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లును 2021లో రాష్ట్ర శాసనసభలో అప్పటి అధికార బీజేపీ ఆమోదించింది. అయితే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీజేపీ అప్పట్లో చేసిన చట్టం అమలుపై చర్చ జరుగుతోంది. 2020 డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించిన సమయంలో దీనిపై నిరసనగా సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.

Karnataka Politics: తాను ముఖ్యమంత్రి కాకపోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడించిన డీకేశివకుమార్

రాష్ట్రంలో గోవుల వధను పూర్తిగా నిషేధించాలని, అక్రమ రవాణా, గోవులపై అఘాయిత్యాలు, వధకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ప్రభుత్వం చేసిన బిల్లు పేర్కొంది. ఆర్డినెన్స్ ప్రకారం, పశువులను వధిస్తే 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు జరిమానాతో పాటు 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. తదుపరి నేరాలకు ఏడేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు.