ఇష్టమొచినట్లు మాట్లాడితే ఊరుకోం : కేసీఆర్ హెచ్చరిక

  • Published By: sreehari ,Published On : January 25, 2020 / 12:18 PM IST
ఇష్టమొచినట్లు మాట్లాడితే ఊరుకోం : కేసీఆర్ హెచ్చరిక

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సోషల్ మీడియాలో నీచాతినీచంగా దుష్ప్రచారం చేశారని, సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ప్రసంగాలు చేస్తుంటే..ప్రజలు అసహ్యించుకుంటున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 

ప్రతిపక్షాల నోటికి మొక్కాలె..ఏం మాట్లాడుతారో వారికే తెలియదు..ముఖ్యమంత్రి ముక్కు కోస్తా అంటాడు..ఇదా సంస్కారమా అని ప్రశ్నించారు. కుసంస్కారంగా, వ్యక్తిగతంగా ఆరోపణలు, సోషల్ మీడియాలో నీచాతినీచంగా ప్రచారం చేశారని విమర్శించారు. దీనిని అరికట్టేందుకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. 2020, జనవరి 25వ తేదీ శనివారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 

వ్యక్తిగతంగా నిందలు మోపితే..మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి పోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్క అధికారితో తాను మాట్లాడలేదని, మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు, ఏ ఒక్క పోలీసు అధికారితో తాను మాట్లాడడం లేదని, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపణలు చేస్తున్నారని ఇది తగునా అని సూటిగా ప్రశ్నించారు. 

ఇలాంటి ఘన విజయం లోకల్ బాడీలకు దొరకదని, డిసెంబర్‌లో శాసనసభ రద్దు చేసిన సమయంలో అనేక అనుమానాలు, జోష్యాలు చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. కానీ 3/4 మెజార్టీతో తాము గెలిచామన్నారు. శాసనసభలో అద్బుతమైన విజయం, పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం జరిగిందని తెలిపారు.

 

ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎన్నికలను ఆపాలని విశ్వప్రయత్నం చేశారని విపక్ష పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అన్ని అవాంతరాలు దాటి ఎన్నికలు జరిగినా..టీఆర్ఎస్‌కు పట్టం కట్టారన్నారు. . ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వ్యక్తిగతంగా, పార్టీ తరపున కృతజ్ఞాభివందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు అభినందనలు, వారి గెలుపు కోసం పని చేసిన వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. 

Read More : ట్వీట్ దుమారం : కపిల్ మిశ్రాకు ఈసీ షాక్..