అలిగిన కేఈ:  కోట్ల చేరికపై సమాచారం లేదు

  • Published By: chvmurthy ,Published On : January 28, 2019 / 04:25 PM IST
అలిగిన కేఈ:  కోట్ల చేరికపై సమాచారం లేదు

కర్నూలు:  కర్నూలు కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో భేటీ అవటంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కినుక వహించారు. కోట్ల వర్గం సీఎంతో  భేటిపై  ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసారు. కోట్ల టీడీపీలో చేరికపై నాకు సమాచరం లేదని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.

కోట్ల ను టీడీపీ లో చేర్చుకునే విషయంలో చంద్రబాబు స్వయంగా చర్చలు జరిపినట్లు సమాచారం.  కోట్ల  పార్టీలో చేరటానికి  చంద్రబాబు ముందు పెట్టిన డిమాండ్లలో డోన్ సీటు ప్రధానమైనది. కోట్ల పార్టీలో చేరితే డోన్ నుంచి ఎవరిని పోటీ చేయించాలన్నదానిపై పీఠముడి పడనుంది.డోన్ నుంచి కోట్ల సుజాతమ్మను,కానీ తన కుమారుడు రాఘవేంద్రను కానీ  బరిలో దించాలని కోట్ల ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 

చాలా కాలంగా  కేఈ కుటుంబం డోన్ నుంచి పోటీ చేస్తోంది. కోట్లతో చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబు డోన్ నియోజకవర్గ అభ్యర్ధి విషయమై కేఈ కష్ణమూర్తితో చర్చించే అవకాశం ఉంది.  కాగా……తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో  పోత్తు పెట్టుకునే విషయాన్ని కేఈ బహిరంగానే వ్యతిరేకించారు. జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా  వైరం ఉంది. కోట్ల పార్టీలో చేరిన తర్వాత జిల్లాలో ఎలాంటి ప్రభావం ఉంటుందోనని టీడీపీ శ్రేణులు వేచి చూస్తున్నాయి.