రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, సురేష్ రెడ్డి ఎన్నిక ఏకగీవ్రం…ముగిసిన నామినేషన్ల గడువు

తెలంగాణలో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిల ఎన్నిక ఏకగీవ్రం అయింది.

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 10:48 AM IST
రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, సురేష్ రెడ్డి ఎన్నిక ఏకగీవ్రం…ముగిసిన నామినేషన్ల గడువు

తెలంగాణలో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిల ఎన్నిక ఏకగీవ్రం అయింది.

తెలంగాణలో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిల ఎన్నిక ఏకగీవ్రం అయింది. రాష్ట్రంలో రెండు స్థానాలకు కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలే నామినేషన్ వేశారు. రాజ్యసభ స్థానాలకు పోటీ లేకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 

కాసేపట్లో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకోనున్నారు. కే.కేశవరావు, సురేష్ రెడ్డి ధృవీకరణ పత్రాలను తీసుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణ రాజ్యసభ సభ్యులుగా ఇద్దరితోపాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రతిపాదనలు లేకపోవడంతో నామినేషన్ల పరిశీలన సందర్భంగానే ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కణకు గురయ్యాయి. 

కాబట్టి కేశవరావు, సురేష్ రెడ్డి రంగంలో నిలిచారు. వీరిద్దరూ ఏకగ్రీవం అయినట్టే. మరికొద్ది సేపట్లో ఇద్దరు అసెంబ్లీకి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికైన్నట్లు ధృవీకరణ పత్రాలు తీసుకోనున్నారు. 
 

Also Read | టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌తో మైనంపల్లి లొల్లి!