నాకు, వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది జూ.ఎన్టీఆర్

ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీ మంత్రి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ పేరుని తెరపైకి తెచ్చారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ తారక్

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 03:41 PM IST
నాకు, వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది జూ.ఎన్టీఆర్

ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీ మంత్రి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ పేరుని తెరపైకి తెచ్చారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ తారక్

ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీ మంత్రి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ పేరుని తెరపైకి తెచ్చారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ తారక్ పేరుని ప్రస్తావిస్తున్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ కాదు.. జూ.ఎన్టీఆర్ అని కొడాలి నాని పదే పదే చెబుతున్నారు. తనకే కాదు వల్లభనేని వంశీకి కూడా రాజకీయ భిక్ష పెట్టింది జూ.ఎన్టీఆర్ అని మరోసారి చెప్పారు. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. జూ.ఎన్టీఆర్ కుటుంబమే కారణం అని స్పష్టం చేశారు.

తిరుమల సెల్ఫ్ డిక్లరేషన్ వివాదంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. తాను శ్రీవారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను అన్నది చంద్రబాబుని అని స్పష్టం చేశారు. చంద్రబాబుని అన్న మాటలకు తాను కట్టుబడి ఉన్నాను అని చెప్పారు. 

సీఎం జగన్ తిరుమలకు వెళ్లడం ఇది మొదటిసారి కాదన్నారు కొడాలి నాని. చంద్రబాబు కావాలని వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ పప్పు మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ లాంటి దద్దమ్మ వల్లే టీడీపీ నాశనం అవుతోందన్నారు.