Kodali Nani : వైఎస్ఆర్ బతికుంటే అలా జరగనిచ్చే వారు కాదు, జగన్‌ను కాపాడుకోవాలి- కొడాలి నాని
Kodali Nani : మహానాడులో ఎన్టీఆర్ వారసుడు బాలయ్య ఫొటో లేకుండా అచ్చెన్నాయుడు లాంటి స్క్రాప్ ఫొటో.. పప్పు, తుప్పుల ఫొటోలు ఎందుకని ప్రశ్నించా.

Kodali Nani
Kodali Nani – YSR : వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూమిని వదిలి స్వర్గానికి వెళ్లిపోతే రాష్ట్రం నష్టపోయిందని మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే తాను రెండు ముక్కలైనా సరే.. రాష్ట్రాన్ని మాత్రం విడిపోనిచ్చేవారు కాదన్నారు. సీఎం జగన్ ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరికి ఉందన్నారు కొడాలి నాని. ఎమ్మెల్యే కొడాలి నాని అధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.
పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నేతలు హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళులర్పించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళు పూర్తి కావడంతో పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని.
” రాజకీయాల్లో ఎప్పుడు వచ్చామనేది కాదు. బుల్లెట్ దిగిందా? లేదా? అన్న విధంగా జగన్ పాలన చేస్తున్నారు. శక్తివంతమైన సోనియానే ఎదిరించి నిలబడిన జగన్ ను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కావడానికి, చంద్రబాబు ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికే కలిసి పోటీ చేస్తున్నారు.
అందరి కోసం పని పని చేస్తూ ప్రజల గుండెల్లో ఉన్నారు జగన్. వైఎస్ఆర్ భూమిని వదిలి స్వర్గానికి వెళ్లిపోతే రాష్ట్రం నష్టపోయింది. వైఎస్ఆర్ బతికుంటే తాను రెండు ముక్కలైనా సరే.. రాష్ట్రాన్ని మాత్రం విడిపోనిచ్చే వారు కాదు. జగన్ ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరికి ఉంది” అని కొడాలి నాని అన్నారు.
”ఇక, మహానాడును ఉద్దేశించి తాను చేసిన స్క్రాప్ వ్యాఖ్యలను కాపు అన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ కట్, పేస్ట్ చేసి వీడియోలు వదిలిందని ఆరోపించారు. మహానాడులో ఎన్టీఆర్ వారసుడు బాలయ్య ఫొటో లేకుండా అచ్చెన్నాయుడు లాంటి స్క్రాప్ ఫొటో.. పప్పు, తుప్పుల ఫొటోలు ఎందుకని ప్రశ్నించా. టీడీపీ, జనసేన తప్పుడు ప్రచారాన్ని కాపు సోదరులు నమ్మరు. వంగవీటి రాధా నాకు తమ్ముడు లాంటి వాడు” అని కొడాలి నాని చెప్పారు.