ఏపీ ఇండియాలో లేదా? విశాఖ ఉక్కుపై కచ్చితంగా మాట్లాడతాం, రేపు మాకు కష్టమొస్తే ఏపీ అండగా ఉంటుంది

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తామన్న కేంద్రం.. ఇవాళ ఏపీలోని విశాఖ ఉక్కుని తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ ఏపీలో విశాఖ ప్లాంట్ ను అమ్ముతున్న కేంద్రం రేపు తెలంగాణలోని సింగరేణి, బీహెచ్ఈఎల్ జోలికి కూడా వస్తుందని చెప్పారు. అందుకే, దేశంలో అన్యాయం ఎక్కడ జరిగినా తాము ప్రశ్నిస్తామని, అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. రేపు తెలంగాణకు కష్టమొస్తే ఏపీ అండగా ఉంటుందని చెప్పారు.

ఏపీ ఇండియాలో లేదా? విశాఖ ఉక్కుపై కచ్చితంగా మాట్లాడతాం, రేపు మాకు కష్టమొస్తే ఏపీ అండగా ఉంటుంది

Ktr Vizag Steel Plant

ktr strong counter to bjp on vizag steel plant: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తామన్న కేంద్రం.. ఇవాళ ఏపీలోని విశాఖ ఉక్కుని తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ ఏపీలో విశాఖ ప్లాంట్ ను అమ్ముతున్న కేంద్రం రేపు తెలంగాణలోని సింగరేణి, బీహెచ్ఈఎల్ జోలికి కూడా వస్తుందని చెప్పారు. అందుకే, దేశంలో అన్యాయం ఎక్కడ జరిగినా తాము ప్రశ్నిస్తామని, అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. రేపు తెలంగాణకు కష్టమొస్తే ఏపీ అండగా ఉంటుందని చెప్పారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై తాము కచ్చితంగా మాట్లాడతామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ అంశంపై తాము ఎందుకు మాట్లాడకూడదని ఆయన బీజేపీని ప్రశ్నించారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేస్తారేమో అని కేంద్రంపై మండిపడ్డారు కేటీఆర్. ఏపీ ఈ దేశంలో లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రం వారికి కష్టం వచ్చినప్పుడు తాము మాట్లాడితే బీజేపీకి ఎందుకంత బాధ అని కేటీఆర్ అడిగారు. పక్క రాష్ట్రాల వారికి కష్టం వచ్చినప్పుడు మేం మాట్లాడకపోతే.. మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు మద్దతిస్తారని కేటీఆర్ అన్నారు. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని కేటీఆర్ చెప్పారు.

”బయ్యారం ఉక్కు సంగతి దేవుడెరుగు. ఉన్న విశాఖ ఉక్కునే తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారు. దాని గురించి అడిగితే, నువ్వెవరు అడగటానికి? నీకేం పని ఆంధ్రప్రదేశ్ తో అంటున్నారు. ఆంధ్రప్రదేశ్.. దేశంలో లేదా? మేం మాట్లాడొద్దా? దేశంలో మాకు హిస్సా లేదా? మాకు నోరు లేదా? ఇవాళ ఏపీ మీద పడ్డావు. రేపు మా సింగరేణి మీద పడతావు. ఈసీఐల్, బీహెచ్ఈఎల్ మీద పడతావు. వాళ్లకు కష్టం వచ్చిందని మేము నోరు మూసుకుంటే, మాకేంలే అంటే, రేపు మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు మద్దతిస్తారు? ఎవరికో కష్టం వచ్చింది. మనకెందుకులే అనే భావన కరెక్ట్ కాదు. ఈ దేశం మనది. మనం తెలంగాణ బిడ్డలమే. దాని కన్నా ముందు మనం భారతీయులం. దేశంలో ఎక్కడ తప్పు పని జరిగినా, అన్యాయం జరిగినా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది” అని కేటీఆర్ అన్నారు.