N440k Mutation : న్యాయ రాజధాని కర్నూలుకు రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు వ్యాఖ్యలు

N440k Mutation : న్యాయ రాజధాని కర్నూలుకు రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు వ్యాఖ్యలు

Kurnool Bar Association President Interview On Chandrababu Comments

N440k Mutation : కర్నూలుకు న్యాయరాజధాని రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు N440K వైరస్ కర్నూలులో బయట పడిందని వ్యాఖ్యానించారని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని … దాన్ని అడ్డుకోవాలనే మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు కొత్తరకం వైరస్ అంటూ వ్యాఖ్యలు చేశారని అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో తీవ్ర కలత చెంది తాను కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని అన్నారు. జిల్లా, రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేసే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని… కోవిడ్ N440K అనే వేరెంట్ వైరస్ కేరళ రాష్ట్రంలో కనుగొన్నారని సుబ్బయ్య తెలిపారు.

కర్నూలు జిల్లా ప్రజానీకం పై విషం కక్కే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని…చంద్రబాబు, కుట్రతో ప్రజలను భయాందోళనకు గురిచేసే విధంగా ఉంది వ్యాఖ్యానించారని ఆయన అన్నారు.N440K కర్నూలు జిల్లాలో ఉద్బవించిందన్న వ్యాఖ్యలతో …కర్నూలులోని ఓల్డ్ టౌన్ ప్రజలు తీవ్ర మానసిక భయాందోళనకు గురై బ్రతుకుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కర్నూలుకు రావడానికి కూడా భయపడుతున్నారని సుబ్బయ్య తెలిపారు.