Rijiju vs Rahul: టుక్డే టుక్డే గ్యాంగ్ అంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి రిజిజు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పునరుజ్జీవనం పోసుకుంటుందని, "తుక్డే-తుక్డే గ్యాంగ్" సభ్యులు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. చైనాను ‘అగ్రరాజ్యం’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించడంపై రిజిజు స్పందిస్తూ "భారతదేశం మీద దాడి చేయడానికి భారతదేశ వ్యతిరేక విదేశీ సంస్థల నుంచి ఈ ముఠాకు క్రియాశీల మద్దతు లభిస్తుంది

Rijiju vs Rahul: టుక్డే టుక్డే గ్యాంగ్ అంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి రిజిజు

Law minister slams Rahul for democracy remark

Rijiju vs Rahul: తాజాగా బ్రిటన్ రాజధాని లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన ఉపన్యాసంలో భారతదేశాన్ని అధ్వాన్నంగా చూపించారంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మీద కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్‭ను ‘టుక్డే టుక్డే గ్యాంగ్’తో పోలుస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ తన ఉపన్యాసంలో తనతో సహా చాలా మంది మంత్రులపై నిరంతర నిఘా కొనసాగుతోందని, భారత ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణంపై దాడి జరిగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్లమెంట్, మీడియా, న్యాయవ్యవస్థ రాజీ పడ్డాయంటూ రాహుల్ కఠినమైన ఆరోపణలు చేశారు.

PM Narendra Modi: మూడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న మోదీ

కాగా, రాహుల్ ప్రసంగంపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ “భారత న్యాయవ్యవస్థ స్వతంత్రమైనది. భారత న్యాయవ్యవస్థను ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించమని ఎవ్వరూ, ఎప్పుడూ బలవంతం చేయలేరు. ప్రజాస్వామ్యం మన రక్తంలో ఉంది. భారత ప్రజాస్వామ్యాన్ని ఎవరూ ప్రశ్నించలేరు’’ అని అన్నారు. శనివారం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన కేంద్ర న్యాయవాదుల సదస్సును రిజిజు ప్రారంభించారు. అనంతరం ఈ సమావేశం గురించి స్పందిస్తూ న్యాయమూర్తుల విజ్ఞత ప్రజల పరిశీలనకు మించినదని రిజిజు అన్నారు.

Rajasthan: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుల్వామా అమరవీరుల సతీమణుల నిరసన.. హామీలు నెరవేర్చాలని డిమాండ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పునరుజ్జీవనం పోసుకుంటుందని, “తుక్డే-తుక్డే గ్యాంగ్” సభ్యులు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. చైనాను ‘అగ్రరాజ్యం’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించడంపై రిజిజు స్పందిస్తూ “భారతదేశం మీద దాడి చేయడానికి భారతదేశ వ్యతిరేక విదేశీ సంస్థల నుంచి ఈ ముఠాకు క్రియాశీల మద్దతు లభిస్తుంది. ఒక క్రమంలో వారు భారతీయుల విశ్వసనీయతను దెబ్బతీస్తుంటారు. ప్రజాస్వామ్యం, భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, రక్షణ, ఎన్నికల సంఘం, దర్యాప్తు సంస్థలు వంటివన్నీ కీలకమైన సంస్థలు. భారత ప్రజలమైన మేము వారికి తగిన సమాధానం ఇస్తాం” అని రిజిజు అన్నారు.