RK Roja : ఇక మిగిలింది కేఏ పాల్‌ జెండానే- పవన్‌ కల్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు

RK Roja : ఎవరైనా అధికారం కోసం పార్టీ పెడతారు. కానీ, పవన్ మరొకరి జెండా మోయడానికే పార్టీ పెట్టారని ఆమె విమర్శించారు.

RK Roja : ఇక మిగిలింది కేఏ పాల్‌ జెండానే- పవన్‌ కల్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు

Rk Roja

RK Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. ఇక, మిగిలింది కేఏ పాల్ జెండానే అంటూ పవన్ ను ఎద్దేవా చేశారు మంత్రి రోజా. అసలు పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కే తెలియాలని రోజా అన్నారు. ఎవరైనా అధికారం కోసం పార్టీ పెడతారు. కానీ, పవన్ మరొకరి జెండా మోయడానికే పార్టీ పెట్టారని ఆమె విమర్శించారు.

పవన్ కల్యాణ్ ఎప్పుడూ టీడీపీ, బీజేపీ జెండా మోస్తూ వారికే ఓటు వేయాలని కోరతారని రోజా అన్నారు. ఇక, మిగిలింది కేఏ పాల్ జెండా మాత్రమే అన్న రోజా వచ్చే ఎన్నికల్లో అది కూడా పవన్ మోసేస్తే గిన్నిస్ బుక్ ఎక్కేయ్యచ్చు అని సెటైర్లు వేశారు.(RK Roja)

Also Read..Andhra Pradesh HC : అమరావతి ఆర్5 జోన్‌పై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ .. రైతుల పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు మంత్రి రోజా. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని ఆమె తేల్చి చెప్పారు. మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. జగన్ లా ఎప్పుడూ పథకాలు ఇవ్వలేదని విమర్శించారు.

మీడియాతో మంత్రి రోజా..
”అడగనిదే అమ్మ కూడా అన్నం పెట్టదని పెద్దలంటారు. కానీ, అడగకుండానే అన్నీ ఇచ్చే అన్న జగన్ మోహన్ రెడ్డి. ఇక, ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుందో మీరే చెప్పండి. ఏ కుటుంబాన్ని తీసుకున్నా.. విద్య, వైద్యం, హౌసింగ్, షాదీ తోఫా, కల్యాణమస్తు, చేయూత, ఆసరా.. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ది చేకూరుతోంది. గడపగడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి చాలా మంది స్పందన వచ్చింది.(RK Roja)

గతంలో ఈ కులం టీడీపీ, ఈ కులం జనసేన, ఈ కులం బీజేపీ, ఈ కులం వైసీపీ అనే వాళ్లు. కానీ, ఇప్పుడు ఏ కులమూ లేదు. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఆశీర్వదిస్తుననారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మాకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదని అంటున్నారు. మా వీధుల్లో, మా మున్సిపాలిటీల్లో జరగాల్సిన అభివృద్దిని మీరు చేస్తున్నప్పుడు ఇక మాకు ఏం కావాలి? అని ప్రజలు అంటున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది.

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా కోటి 48లక్షల గృహాలకు వెళ్లినప్పుడు.. కోటి 15లక్షల మంది.. మేము మీతో ఉన్నామని మిస్డ్ కాల్స్ ద్వారా జగనన్నకు చెప్పడం అనేది నభూతో నభవిష్యత్. ఏ రాష్ట్రంలోనూ ఎవరెన్ని తలకిందులు తపస్సు చేసినా ఇవి జరగవు. ఒక్క ఏపీలో జరుగుతున్నాయి అంటే వైసీఆర్ కుటుంబం ఇచ్చిన మాటకు నిలబడుతున్నారు. ప్రజలను తమ కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. వారికి తమ బాధ్యతగా అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వ్యతిరేకత అనేది ఉండదు.(RK Roja)

Also Read..AP CM YS Jagan: చదువు ఉంటేనే పేదరికం నుంచి బయటపడగలం.. కల్యాణమస్తు, షాదీతోఫా నిధులు విడుదల చేసిన జగన్ ..

ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా మేము ఏదో చేసేస్తాం అంటే ఎవరూ నమ్మరు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏనాడైనా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారా? పవన్ కల్యాణ్ 9ఏళ్లు అవుతోంది పార్టీ పెట్టి. పార్టీ ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? అధికారంలోకి వస్తే ఏం చేస్తాము? అనేది ఎప్పుడైనా పవన్ చెప్పారా? ఎంతసేపూ మోదీకి ఓటేయండి లేదా చంద్రబాబుకి ఓటేయండి అని అంటారు. ఎవరైనా పార్టీ పెడితే నాకు ఓటు వేయండి నేను ముఖ్యమంత్రి అవుతాను. మీకు ఇది చేస్తా అని చేస్తా అని చెబుతారు. ఇది కామన్. ఇలా అనడం ఈ దేశంలో అనేక పార్టీలు మాట్లాడటం మనం విన్నాం.

కానీ, మన రాష్ట్రంలో మాత్రం ఎప్పుడు ఏ జెండా మోద్దామా, ప్యాకేజీకి కట్టుబడి ఉందామా అని పవన్ చూస్తున్నారు. ఒక కేఏ పాల్ పార్టీ జెండా ఒక్కటే పవన్ మోయలేదు అనుకుంటా. 2024లో ఆ జెండా కూడా మోస్తే పవన్ కల్యాణ్ గిన్నిస్ బుక్ కి ఎక్కుతారు.(RK Roja)