వైసీపీ మంత్రులు గూండాల్లా వ్యవహరించారు : మండలి పరిణామాలపై లోకేశ్ బహిరంగ లేఖ

మూడు రాజధానుల బిల్లు సందర్భంగా ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఆయన లేఖలో ఆరోపించారు.

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 05:00 PM IST
వైసీపీ మంత్రులు గూండాల్లా వ్యవహరించారు : మండలి పరిణామాలపై లోకేశ్ బహిరంగ లేఖ

మూడు రాజధానుల బిల్లు సందర్భంగా ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఆయన లేఖలో ఆరోపించారు.

మూడు రాజధానుల బిల్లు సందర్భంగా ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఆయన లేఖలో ఆరోపించారు. సర్కారు తీరును, గూండాల్లా దాడి చేసిన మంత్రుల వ్యవహార శైలిని ప్రపంచం ముందు తెచ్చేందుకు బహిరంగ లేఖ విడుదల చేస్తున్నానని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్న లోకేశ్.. 2014లో రాష్ట్ర విభ‌జ‌న‌ను ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పార్లమెంటు తలుపులు మూసి.. లైవ్ టెలికాస్ట్ ఆపేసి.. ఏపీ ఎంపీల‌పై దాడిచేసి మూక‌బ‌లంతో బిల్లు తెచ్చారో.. అదేవిధ‌మైన దారుణ ప‌రిస్థితులు శాసనమండలిలో చోటుచేసుకున్నాయని లేఖలో లోకేశ్ పేర్కొన్నారు. 

ఇలాంటి దౌర్జన్యకర సంఘ‌ట‌న‌ల‌కు పాల‌క‌ప‌క్షం పాల్పడటం ప్రజాస్వామ్యానికి చీకటిరోజన రోజన్న లేకేశ్. మండ‌లిలో స‌భ్యులు, మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల‌పై దాడుల‌కు దిగారన్నారు. మండ‌లి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేశారని. ఇంటర్ నెట్ సేవలు ఆసేశారని, క‌రెంటు క‌ట్ చేశారన్నారు. ఇటువంటి స‌మ‌యంలో గౌర‌వ అధ్యక్షస్థానంలో ఉన్న షరీఫ్ గారిని పట్టుకొని అంతుచూస్తామని వైసీపీ నేతలు బెదిరించారని లోకేశ్ తెలిపారు.. ఇతర టీడీపీ సభ్యులపైనా మూకుమ్మడి దాడికి దిగారని లేఖలో పేర్కొన్నారు.