#BudgetSession2023: రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ దద్దరిల్లిన పార్లమెంట్.. ప్రారంభమైన కాసేపటికే ఇరు సభలు వాయిదా

కర్ణాటకలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ తన బ్రిటన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఇది 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ గొప్ప సంప్రదాయాలను, దాని పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అభివర్ణించారు

#BudgetSession2023: బడ్జెట్ సమావేశాల రెండవ దశ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే పార్లమెంటు ఇరు సభలు ప్రారంభమైన వెంటనే విపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ అధికార పక్ష నేతలు డిమాండ్ చేశారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పోటా పోటీ నినాదాలు, వాగ్వాదాల మధ్య సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు సభలను సభాధక్ష్యులు వాయిదా వేశారు.

UP IPS: రూ.20 లక్షలు లంచం తీసుకున్న ఐపీఎస్ అధికారి.. గంటల వ్యవధిలోనే విచారణ ప్రారంభించిన ప్రభుత్వం

రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌‭లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్‌లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేకసార్లు ఇలా జరిగిందన్నారు. భారతీయ ప్రజాస్వామిక నిర్మాణంపై కిరాతక దాడి జరుగుతోందన్నారు. దేశంలోని వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా పరస్పరం విమర్శించుకున్నాయి.

Bombay HC: టైరు పేలడం దేవుడి మహిమ కాదు కదా.. కంపెనీని రూ.1.25 కోట్లు ఇవ్వమన్న కోర్టు

ఈ సందర్భాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తాజాగా విరుచుకుపడ్డారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ తన బ్రిటన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఇది 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ గొప్ప సంప్రదాయాలను, దాని పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అభివర్ణించారు. కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రతి దాడి తీవ్ర స్థాయిలో చేసింది. ప్రధాని విధానాలపై విమర్శలు ఎప్పటి నుంచి దేశంపై విమర్శగా మారాయని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు