త్వరపడండి : మరో నాలుగు పట్టణాల్లో ఎల్‌ఆర్‌ఎస్

  • Published By: chvmurthy ,Published On : November 10, 2019 / 03:26 AM IST
త్వరపడండి : మరో నాలుగు పట్టణాల్లో ఎల్‌ఆర్‌ఎస్

తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో అవకాశం ఇచ్చింది.  కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పట్టణాభివృధ్ది సంస్దల పరిధిలోనూ లేఅవుట్ల క్రమబధ్ధీకరణ పధకం(ఎల్ఆర్ఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. 

శాతావాహాన పట్టణాభివృధ్ది సంస్ధ(కరీంనగర్), 62 గ్రామ పంచాయతీలు,
నిజామాబాద్ పట్టణాభివృధ్ధి సంస్ధ, 72 గ్రామ పంచాయతీలు, 
స్తంభాధ్రి పట్టణాభివృధ్ధి సంస్ధ (ఖమ్మం) 45 గ్రామ పంచాయతీలు, 
సిద్దిపేట పట్టణాభివృధ్ధిసంస్ధల పరిధిలోకి వచ్చే 20 గ్రామాల్లో అమలు చేయనున్నారు. ఈ పధకం నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ నాలుగు పట్టణాభివృద్ధి సంస్థల్లో 2018 మార్చి 30 కంటే ముందు కొనుగోలుచేసిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుకు తొంభై రోజుల గడువు ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ప్లాట్ యజమాని క్రమబద్దీకరణ ఛార్జీల్లో 10 శాతం లేదా 10 వేల రూపాయలు చెల్లించాలని,మిగతా సొమ్ము 6 నెలల్లో చెల్లించాలని సూచించారు.