Maharashtra: మరో పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ.. ఈసారి సెగ శివసేన నుంచి

రాహుల్ గాంధీ గత ఏడాది నవంబరులో భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావర్కర్ బ్రిటిష్‌వారికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకునేవారు అన్నారు. తనను అండమాన్ సెల్యులార్ జైలు నుంచి విడుదల చేయాలని కోరేవారని చెప్పారు. బ్రిటిష్ పాలకుల నుంచి పింఛను కూడా స్వీకరించారన్నారు

Maharashtra: మరో పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ.. ఈసారి సెగ శివసేన నుంచి

Maharashtra CM Shinde attacks Rahul over Savarkar remark

Maharashtra: ఇప్పటికే మోదీ ఇంటిపేరు మీద పరువు నష్టం దావా వేయడంతో రెండేళ్ల జైలు శిక్ష ఎదుర్కొన్న రాహుల్.. తాజాగా మరో పరువు నష్టం దావా ఎదుర్కోనున్నారు. తాను సావర్కర్ కానని, క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీ వేదికగా శనివారం షిండే మాట్లాడాుతూ రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Nitu Ghanghas: బాక్సింగ్‌లో సత్తా చాటిన నీతూ గంగాస్.. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్

రాహుల్ గాంధీ కొన్ని నెలల క్రితం సావర్కర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలపై మహారాష్ట్ర శాసన సభలో నిరసన వ్యక్తమైంది. రాహుల్ పోస్టర్లను అధికార పార్టీ సభ్యులు చెప్పులతో కొట్టారు. ఈ నేపథ్యంలో సీఎం షిండే శాసన సభలో మాట్లాడుతూ, వినాయక్ దామోదర్ సావర్కర్ మహారాష్ట్రకు మాత్రమే కాకుండా యావత్తు భారత దేశానికి దేవుని వంటివారని అన్నారు. అలాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ కించపరిచారన్నారు. రాహుల్ చేసిన పనికి ఎంతగా విమర్శించినా తక్కువే అవుతుందని షిండే అన్నారు.

TSPSC Paper Leak : ఈసారైనా నోరు విప్పుతారా? ఆ నలుగురు నిందితులే సిట్ కస్టడీకి

రాహుల్ గాంధీ గత ఏడాది నవంబరులో భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావర్కర్ బ్రిటిష్‌వారికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకునేవారు అన్నారు. తనను అండమాన్ సెల్యులార్ జైలు నుంచి విడుదల చేయాలని కోరేవారని చెప్పారు. బ్రిటిష్ పాలకుల నుంచి పింఛను కూడా స్వీకరించారన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన సాయపడ్డారన్నారు. కాగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అవే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరో పరువు నష్టం కేసును ఎదుర్కొనవలసి వస్తుందేమోనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.