Bihar: తేజశ్వీ యాదవ్‭ని ఇప్పుడే ముఖ్యమంత్రి చేయండి.. నితీశ్ కుమార్‭కు పీకే సలహా

నితీశ్ చేసిన వ్యాఖ్యలను మహాగట్‭బంధన్ కూటమి నేతలు సమర్ధించారు. తేజశ్వీ మంచి యువ నాయకుడని.. ఉత్సాహం, సామర్థ్యం ఉన్న నాయకుడని సీపీఐ(ఎంఎల్) నాయకుడు మహబూబ్ ఆలం అన్నారు. నితీశ్ చెప్పినట్లుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తేజశ్వీ నాయకత్వంతోనే జరుగుతాయని అన్నారు. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజశ్వీ నేతృత్వంలోని మహాగట్‭బంధన్ అత్యుత్తమ పనితీరు కనబరించిందనే చెప్పవచ్చు

Bihar: తేజశ్వీ యాదవ్‭ని ఇప్పుడే ముఖ్యమంత్రి చేయండి.. నితీశ్ కుమార్‭కు పీకే సలహా

Make Tejashwi Yadav Bihar CM now, PK advice to Nitish Kumar

Bihar: బిహార్ ముఖ్యమంత్రిగా తేజశ్వీ యాదవ్‭ని ఇప్పుడు ముఖ్యమంత్రిని చేయండంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭కి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చారు. 2025లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తేజశ్వీ నాయకత్వంలోనే జరుగుతాయంటూ నితీశ్ వ్యాఖ్యనించిన అనంతరం పీకే ఈ విధంగా స్పందించారు. వాస్తవానికి మహాగట్‭బంధన్ (మహా కూటమి)లో జేడీయూ కంటే ఆర్జేడీకే ఎక్కువ స్థానాలు ఉన్నాయని, దాని ప్రకారం తేజశ్వీ ముఖ్యమంత్రి కావడమే సబబని ఆయన అభిప్రాయపడ్డారు.

Shampoo Marriage Cancel : కొంపముంచిన షాంపూ.. ఏకంగా పెళ్లే క్యాన్సిల్ అయ్యింది..!

ప్రస్తుతం జన్ సురాజ్ పాదయాత్రలో ఉన్న పీకే.. శనివారం మాట్లాడుతూ ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేజశ్వీనే మహాగట్‭బంధన్ నాయకుడిగా ఉంటారని నితీశ్ చెప్పారు. మంచిదే, కాకపోతే అప్పటి వరకు ఎందుకు? తేజశ్వీని ఇప్పుడే ముఖ్యమంత్రిని చేయండి. కూటమిలో జేడీయూ కంటే ఆర్జేడీకే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆ లెక్కన చూసుకుంటే తేజశ్వీనే ముఖ్యమంత్రి కావాలి. అంతే కాకుండా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో మూడేళ్ల సమయం ఉంది. ఈ మూడేళ్లు ముఖ్యమంత్రిగా పని చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ పని తీరును చూసి ప్రజలు ఓట్లేస్తారు’’ అని అన్నారు.

Giriraj Singh: నితీశ్ కుమార్ వారం రోజులు సెలవు తీసుకుని ధ్యానం చేయాలి: కేంద్ర మంత్రి

నితీశ్ చేసిన వ్యాఖ్యలను మహాగట్‭బంధన్ కూటమి నేతలు సమర్ధించారు. తేజశ్వీ మంచి యువ నాయకుడని.. ఉత్సాహం, సామర్థ్యం ఉన్న నాయకుడని సీపీఐ(ఎంఎల్) నాయకుడు మహబూబ్ ఆలం అన్నారు. నితీశ్ చెప్పినట్లుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తేజశ్వీ నాయకత్వంతోనే జరుగుతాయని అన్నారు. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజశ్వీ నేతృత్వంలోని మహాగట్‭బంధన్ అత్యుత్తమ పనితీరు కనబరించిందనే చెప్పవచ్చు. అతి స్వల్ప తేడాతో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది.