Mallu Bhatti Vikramarka : ఇక దోపిడీ పాలన చాలు, ప్రజా ప్రభుత్వం రావాల్సిన సమయం వచ్చింది- భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka : మనకు మనమే తెలంగాణను రక్షించుకునేందుకు మరో ఓట్ల ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. నిధులను కాజేయడానికి రీ-డిజైన్ చేసిన అతి పెద్ద స్కాం కాలేశ్వరం.

Mallu Bhatti Vikramarka : ఇక దోపిడీ పాలన చాలు, ప్రజా ప్రభుత్వం రావాల్సిన సమయం వచ్చింది- భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka(Photo : Google)

Mallu Bhatti Vikramarka : సీఎం కేసీఆర్ పాలనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఇక కేసీఆర్ దోపిడీ పాలన చాలన్న భట్టి విక్రమార్క.. ప్రజా ప్రభుత్వం రావాల్సిన అవసరం, సమయం ఆసన్నమైందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ లీజు వ్యవహారంపైనా భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

భవిష్యత్తులో 30ఏళ్ల వరకు చెల్లించాల్సిన పన్నులు ఈ ప్రభుత్వానికే చెల్లించే విధంగా ఓ ప్రైవేటు ఏజెన్సీకి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అంటగట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలి? భవిష్యత్తు పరిపాలన ఎట్లా నడవాలి? ఈ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలి అని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

” హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తెలంగాణకు మణిహారంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించే చర్యను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళతాం. భారత రాష్ట్రపతికి లేఖ రాసి కట్టడి చేయాలని కోరతాము. నిధులను కాజేయడానికి రీ-డిజైన్ చేసిన అతి పెద్ద స్కాం కాలేశ్వరం. పంపులు, పైపుల పేరిట ఖర్చు చేసి ప్రభుత్వ పెద్దలు, దళారులు బాగుపడ్డారే తప్ప తెలంగాణలో ఒక ఇంచు భూమికి కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేదు.(Mallu Bhatti Vikramarka)

Also Read..Kothagudem Constituency: కొత్తగూడెంలో హీటు రేపుతోన్న పొలిటికల్ టెంపరేచర్.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్ అదే!

తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి సినిమా చూపించినట్టుగా కాలేశ్వరం నీళ్లు పారిస్తున్నామని ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం నిధులన్నీ దుర్వినియోగం చేసింది. నేను చెప్పిన విషయాల్లో ఎవరికైనా అనుమానం ఉంటే చర్చకు సిద్ధం. ఇక కేసీఆర్ దోపిడీ పాలన చాలు. మనకు మనమే తెలంగాణను రక్షించుకునేందుకు మరో ఓట్ల ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రభుత్వం రావలసిన అవసరం, సమయం ఆసన్నమైంది.

ఇరిగేషన్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. నియంత రాజుగా సీఎం కేసీఆర్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటు చేసిన చట్టాలను ఏ మాత్రం గౌరవించడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఎకరానికి 50 నుంచి 60 లక్షల రూపాయల ధర ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. నిర్వాసితులకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఎట్లా ఇస్తారు? దోపిడీదారుల కోసం తెలంగాణ తెచ్చుకోలేదు.(Mallu Bhatti Vikramarka)

Also Read.. Wyra: 3 ఎన్నికలు.. 3 విలక్షణమైన తీర్పులు.. ఈసారి వైరాలో గెలిచేది ఏ పార్టీ అభ్యర్థి?

భూమికి, మనుషులకు విడదీయని అనుబంధం ఉంటుంది. అలాంటి అనుబంధాన్ని అంధకారంగా మార్చే పాలన తెలంగాణ సమాజానికి అవసరమా? పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది” అని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.(Mallu Bhatti Vikramarka)