Tripura: మాణిక్ సాహానే మళ్లీ సీఎం.. రెండోసారి ఎన్నుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు

ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. మాణిక్ సాహా.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన 2016లో బీజేపీలోకి వచ్చారు. అనంతరం కేవలం పది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్ దేవ్‫‭ని తొలగించిన ఈయనకు అవకాశం కల్పించారు.

Tripura: త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహానే మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు. సోమవారం జరిగిన పార్టీ లెజిస్టేచర్ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధిష్టానం నుంచి కూడా ఇదే సూచన ఉండడంతో బీజేపీ నుంచి మరే అభ్యర్థి ముఖ్యమంత్రిగా పోటీకి రాలేదు. దీంతో వరుసగా రెండసార్లు ముఖ్యమంత్రి అవకాశాన్ని మాణిక్ సాహా అందిపుచ్చుకున్నారు.

Delhi: తన మీద తప్పుడు కేసు పెట్టారని పోలీస్ స్టేషన్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు

కొద్ది రోజుల క్రితం జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి అద్భుతమైన విజయం సాధించింది. బీజేపీకి ఇది వరుస రెండో విజయం. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 32 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాగా, బీజేపీతో చేతులు కలిపిన ఇండీజియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఈ రెండు పార్టీల కలయికలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

Nagpur: రేప్ అనంతరం గర్భం దాల్చిన బాలిక.. తల్లికి తెలియకూడదని డెలివరీ అయిన వెంటనే..

మార్చి 8న ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. మాణిక్ సాహా.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన 2016లో బీజేపీలోకి వచ్చారు. అనంతరం కేవలం పది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్ దేవ్‫‭ని తొలగించిన ఈయనకు అవకాశం కల్పించారు. మాణిక్ సాహా.. రాజకీయాల్లోకి రాకముందు హపానియాలో ఉన్న త్రిపుర మెడికల్ కాలేజీలో పాఠాలు చెప్పేవారు, అలాగే మాక్సిలోఫేసియల్ సర్జన్‭గా పని చేశారు.

ట్రెండింగ్ వార్తలు