టీటీడీ బంగారం తరలింపుపై నివేదిక రెడీ

  • Published By: chvmurthy ,Published On : April 23, 2019 / 02:08 PM IST
టీటీడీ బంగారం తరలింపుపై నివేదిక రెడీ

అమరావతి: టీటీడీకి చెందిన బంగారం తరలింపు వ్యవహారం పై ఏర్పాటైన  మన్మోహన్ కమిటీ తన నివేదికను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అందచేసింది. 2019 ,ఏప్రిల్ 17 వ తేదీన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వేంపట్టులో పంజాబ్ నేషనల్  బ్యాంకు నుంచి తరలిస్తున్న 1381 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  కాగా ఈ బంగారం టీటీడీ ది అని బంగారం తరలిస్తున్న వ్యక్తులు చెప్పగా, పట్టుబడ్డ బంగారంతో తమకెలాంటి సంబంధం లేదని టీటీడీ బోర్డు స్పృష్టం చేసింది.

బంగారం తరలింపు పై  ఏపీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  మన్మోహన్ సింగ్ తో విచారణ జరిపించింది. ఈ అంశంపై తిరుపతిలో టీటీడీ ఈవో , విజిలెన్స్ ,పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులను విచారించిన మన్మోహన్ సింగ్ , తన నివేదికను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మంగళవారం  అందచేశారు.
Also Read : ఇదే బెస్ట్ ఆప్షన్ : బ్యాంకుల్లోని మీ బంగారం భద్రమేనా?