Punjab Politics: సిద్ధూ వల్లే భగవంత్ మాన్ సీఎం అయ్యారా.. ఇంతకీ సిద్ధూ భార్య బయటపెట్టిన విషయం ఏంటి?

గతంలో సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ అప్పట్లో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామనా ఆ పార్టీ స్పష్టం చేయడంతో ఆయన అటు వైపు వెళ్లలేదు. ఇక అప్పటి నుంచి పార్టీ మారే యోచన లేకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు

Punjab Politics: సిద్ధూ వల్లే భగవంత్ మాన్ సీఎం అయ్యారా.. ఇంతకీ సిద్ధూ భార్య బయటపెట్టిన విషయం ఏంటి?

Navjot Kaur: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ వల్లే భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయ్యారంటూ సిద్ధూ భార్య నవజ్యోత్ కోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో ఆప్ పార్టీకి సారథ్యం వహించాల్సిందిగా వివిధ మార్గాల ద్వారా సిద్ధూను ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారని, అయితే ఆయన ఆ పదవిని తిరస్కరించడం వల్లే ఆ స్థానాన్ని మాన్ భర్తీ చేశారని ఆమె వెల్లడించారు. సిద్ధూ, భగవంత్ మాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని బయటపెట్టారు.

Kolhapur Clashes: యూపీలో చేసినట్టే వారిని కూడా కాల్చిపారేయాలి.. కొల్హాపూర్ అల్లర్లపై సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు

ఇది చాలా కాలంగా రహస్యంగా ఉన్న విషయమని, కానీ నేటి పరిస్థితుల్లో బయట పెట్టాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై ఆమె శుక్రవారం వరుస ట్వీట్ల ద్వారా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మీద విరుచుకుపడ్డారు. ”మీరు (భగవంత్ మాన్) కూర్చున్న ముఖ్యమంత్రి సీటు మీ సోదరుడు (సిద్ధూ) మీకు ఇచ్చిన కానుక అనే విషయం ముందు మీరు గ్రహించాలి” అని భగవంత్ మాన్‌ను ఉద్దేశించి కౌర్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

Andhra Pradesh: మరింత ముందుకు నైరుతి రుతుపవనాలు.. ఏపీకి వర్ష సూచన

”ముఖ్యమంత్రి భగవంత్ మాన్… మీ ట్రెజర్ హంట్‌లోని ఓ రహస్యాన్ని ఈరోజు బయటపెడుతున్నాను. మీరు పొందిన గౌరవ స్థానం (ముఖ్యమంత్రి పదవి) మీ సోదరుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మీకు ఇచ్చిన కానుకేననే విషయం గుర్తించుకోండి. మీ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడే స్యయంగా పంజాబ్‌కు సారథ్యం వహించాలని సిద్ధూను కోరారు” అని కౌర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పంజాబ్ పట్ల సిద్ధూకు ఉన్న అభిరుచి గుర్తించే కేజ్రీవాల్ సంప్రదింపులు సాగించారని వెల్లడించిన ఆమె.. సొంత పార్టీని వంచించరాదనే కారణంతో సిద్ధూ అందుకు ఒప్పుకోవలేదని, అదే మాన్‭కు అవకాశంగా మారిందని కౌర్ అన్నారు.

Odisha train Accident : క్లాసు రూముల్లో మృతదేహాలు .. స్కూలుకెళ్లాలంటే భయపడుతున్న విద్యార్థులు

గతంలో సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ అప్పట్లో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామనా ఆ పార్టీ స్పష్టం చేయడంతో ఆయన అటు వైపు వెళ్లలేదు. ఇక అప్పటి నుంచి పార్టీ మారే యోచన లేకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఒకానొక సమయంలో ఆయన కాంగ్రెస్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థనే ప్రచారం జరిగింది. కానీ, అప్పటి సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ అ అవకాశాన్ని కొట్టేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడడంతో తన పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేశారు.